మటన్ పాయ తింటున్నారా? అయితే ఇది మస్ట్‌గా తెలుసుకోండి
23 July 2025
Prudvi Battula
మటన్ పాయలో ఉన్న కాల్షియం, ఫాస్ఫరస్, ఇతర ఖనిజాలతో ఎముకలు బలంగా ఉంటాయి. పెద్దవారిలో ఎముకల ఆస్టియోపోరోసిస్ సమస్యలను తగ్గిస్తుంది.
ఇందులోని కొల్లాజెన్, జిలేటిన్ అనేవి జాయింట్ల నొప్పులను తగ్గుముఖం పడతాయి. కీళ్ల చలాకితనం మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.
పాయలో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నందున శరీర కండరాల నిర్మాణానికి, రికవరీకి సహాయపడుతుంది. ఇది శరీరానికి ఎనర్జీని అందిస్తుంది.
దీనిలోని విటమిన్ బి12 శక్తి స్థాయిలను పెంచుతాయి. ఇది తేలికగా జీర్ణమవుతుంది. పచ్చికూరలు, కూరగాయలతో తీసుకుంటే మరింత ఆరోగ్యం.
ఇందులో విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్థాయి. ఇది జలుబు, ఫ్లూ వంటి చిన్న వైరస్ ఇన్ఫెక్షన్‌లకు మంచి నివారణ.
పాయలోని కొల్లాజెన్ చర్మానికి మృదుత్వాన్ని, కాంతిని ఇస్తుంది. చర్మ కణాల ఉత్పత్తిని పెంచి యవ్వనంగా కనిపించడానికి దోహదం చేస్తుంది.
మటన్ పాయ గుండె, కిడ్నీ, కాలేయానికి సహజ రక్షణను అందిస్తుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు అవయవాల సమగ్రతను కాపాడుతాయి.
పాయ గాయాలను త్వరగా నయం చేయగలదు. శస్త్ర చికిత్స తర్వాత రికవరీలో ఈ మటన్ పాయ సూప్ తీసుకుంటే శరీరం త్వరగా కోలుకుంటుంది.
మటన్ పాయ సూప్ తక్కువ క్యాలరీలు ఉన్నందున రాత్రి లేదా మధ్యాహ్నం భోజనంలో తీసుకోవచ్చు. బరువు తగ్గాలని అనుకునేవారికి కూడా ఇది సురక్షితమైన ఆహారం.
మరిన్ని వెబ్ స్టోరీస్
పెరుగుతో ఈ కూరగాయలు తింటే యమ డేంజర్
రోజూ గుప్పెడు పిస్తా తింటే చాలు.. మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష
అదృష్టం, ఐశ్వర్యం మీ ఇంటి తలుపు తట్టాలంటే..