సపోటా మీ డైట్లో ఉంటే.. ఆ సమస్యలకు మోత మోగినట్టే..
12 August 2025
Prudvi Battula
సపోటాలో విటమిన్లు ఎ, సిలు పుష్కలంగా ఉన్నందున తెల్ల రక్త కణాల ఉత్పత్తి, కొల్లాజెన్‌ను ప్రోత్సహించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ మెరుగుపరుస్తాయి.
సపోటాలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహిస్తుంది. ఇది మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తుంది.
సపోటాలో సహజంగా సుక్రోజ్, ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటాయి. ఇది ముఖ్యంగా తీవ్రమైన క్రీడా కార్యకలాపాలు లేదా వ్యాయామం చేసేటప్పుడు శక్తిని పెంచుతుంది.
సపోటాలోని విటమిన్లు A, Eలు చర్మ కణాలను పునరుజ్జీవింపజేయడం, తేమను నిలుపుకోవడం, అకాల వృద్ధాప్యం దూరం చేసి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.
సపోటాలోని కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ ఖనిజాలు బలమైన ఎముకలను నిర్మాణంలో, ఆస్టియోపోరోసిస్ నివారించడంలో సహాయపడతాయి.
ఇందులోని పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఈ పండులో అధిక ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. దీంతో తక్కువ తింటారు. ఇది బరువు తగ్గాలనుకొనేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇందులో ఉన్న విటమిన్ ఎ కంటి దృష్టిని కాపాడుతుంది. అలాగే మాక్యులర్ క్షీణతను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
పోద్ది.. అలా చేస్తే మొత్తం పోద్ది.. మారిన ట్యాక్స్ రూల్స్!
వర్షాకాలంలో ఈ ఫుడ్స్ తింటే.. మీ ఆరోగ్యం అస్సలు తగ్గేదేలే..
స్త్రీ శరీరంపై ఆ ప్రదేశాల్లో బల్లి పడితే.. శుభమా.? అరిష్టమా.?