నల్లగా ఉన్న ఈ రైస్‌తో బోలెడు ప్రయోజనాలు..
29 July 2025
Prudvi Battula
నల్ల బియ్యం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. ముఖ్యంగా, ఇది యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మరియు ఇతర పోషకాల గని.
నల్ల బియ్యంలో ఉండే ఆంథోసైనిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం మంచిది.
నల్ల బియ్యంలో యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. దీంతో ఎప్పుడు ఆరోగ్యంగా, హాయిగా ఉంటారు.
నల్ల బియ్యంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నల్ల బియ్యంలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల దీన్ని మీ డైట్లో చేర్చుకొంటే జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది.
ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా, నల్ల బియ్యం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. వెయిట్ లాస్ కోసం ఇవి బెస్ట్.
నల్ల బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఇది మధుమేహం ఉన్నవారికి ఉపయోగపడుతుంది.
నల్ల బియ్యం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు చర్మం యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది.
క్యాన్సర్, వాపు, వృద్ధాప్య సమస్యలకు కూడా నల్ల బియ్యం ఉపయోగపడుతుంది. వీటిని తీసుకొంటే చర్మ సమస్యలన్నీ దూరం.
మరిన్ని వెబ్ స్టోరీస్
మండె పచ్చిమిర్చితో ప్రయోజనాలు మెండు..
ఈ ఫుడ్స్ దూరం పెడితే.. సేఫ్ జోన్లో మీ లివర్..
శ్రావణ మాసంలో ఈ పనులు అస్సలు చేయవద్దు..