వేరుశనగలను సామాన్యుడి జీడిపప్పుగా వ్యవహరిస్తారు. తక్షణ శక్తినిచ్చే వీటిలో పోషకాలూ అధికమే. ఆరోగ్యంతోపాటు సౌందర్యపోషణలోనూ ప్రధాన పాత్ర వహిస్తాయి
TV9 Telugu
పల్లీలను ఆరేడు గంటలు నానబెట్టి వాడుకుంటే తేలికగా జీర్ణమవుతాయి. పచ్చి వేరుశనగ పప్పులను తింటే మరీ మంచిది. వీటిలో కొలెస్ట్రాల్ జీరో
TV9 Telugu
గుండె జబ్బులు తగ్గిస్తాయి. కండరాలకు బలాన్ని చేకూరుస్తాయి. ఎక్కువ మొత్తంలో మాంసకృత్తులు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యానికి ఉపకరిస్తాయి
TV9 Telugu
మంచి కొవ్వులూ అధికమే. విటమిన్-ఇ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టుతోపాటు చర్మాన్నీ రక్షిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా మారతాయి. వీటి నుంచి విటమిన్లు, మినరల్స్ మెండుగా లభిస్తాయి
TV9 Telugu
వీటిలో ప్రొటీన్లు, పీచు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. వేరుశెనగలు పోషకాలతో సమృద్ధిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి
TV9 Telugu
వేరుశనగలు సహజంగానే వేడి స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి, శీతాకాలంలో వీటిని తినడం మంచిది. అయితే చాలా మంది వేరుశెనగలు తిన్న తర్వాత నీళ్లు తాగుతుంటారు
TV9 Telugu
సాధారణంగా పల్లీలు తిన్న తర్వాత నీళ్లు, ఐస్ క్రీం, నిమ్మరసం, లస్సీ వంటి శీతల పానీయాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జలుబు, దగ్గు వస్తాయట
TV9 Telugu
వేరుశెనగలు మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా శక్తిని కూడా అందిస్తాయి. వేరుశెనగలు కండరాలకు మేలు చేస్తాయి. నువ్వులు, వేరుశనగలు, బెల్లంతో లడ్డులు లేదా చిక్కీలు తయారు చేసి తింటే మంచిది