మనం ఎక్కువగా వండుకునే కూరగాయల్లో బంగాళాదుంపలు కూడా ఒకటి. రుచికరమైన కర్రీలు, ఫ్రైలు, చిప్స్... వంటి రకరకాల వంటకాలను చేసుకుంటాం
TV9 Telugu
పిల్లలు కూడా వీటిని ఇష్టపడి తింటుంటారు. అయితే బంగాళాదుంపల నిల్వకు సంబంధించి తరచుగా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు కొంతమంది
TV9 Telugu
వీటిని ఫ్రిజ్‌లో స్టోర్ చేయడమో లేదా ప్లాస్టిక్ సంచుల్లో ఉంచడమో చేస్తుంటారు. ఫలితంగా ఇవి త్వరగా కుళ్లిపోయే అవకాశముందంటున్నారు నిపుణులు
TV9 Telugu
ఫ్రిజ్‌లో వీటిని స్టోర్ చేస్తే... దుంపల్లోని స్టార్చ్ షుగర్‌గా రూపాంతరం చెందుతుంది. ఫలితంగా ఉడికించినప్పుడు ఇవి తియ్యగా మారిపోతాయి
TV9 Telugu
అందుకే వీటిని ఫ్రిజ్‌లో పెట్టకూడదంటున్నారు నిపుణులు. అలాగే సూర్యరశ్మి ఎక్కువగా తగిలే, ఉష్ణోగ్రత అధికంగా ఉండే ప్రదేశాల్లోనూ వీటిని నిల్వ చేయకూడదు
TV9 Telugu
వీలైనంతవరకు బాగా గాలి ప్రసరించే, చల్లని చీకటి ప్రదేశాల్లోనే స్టోర్ చేయాలట. రంధ్రాలున్న బ్యాగులు, పేపర్ సంచుల్లో వీటిని నిల్వ చేయడం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి
TV9 Telugu
నిల్వ చేసేముందు బంగాళాదుంపలను నీటితో కడగకూడదు. దీనివల్ల త్వరగా పాడైపోయే అవకాశముందట. వీటిని స్టోర్ చేయకపోతే మొలకలొస్తాయి
TV9 Telugu
ఈ క్రమంలో ఉత్పత్తయ్యే రసాయనాల వల్ల ఇవి రుచిని, తాజాదనాన్ని కోల్పోయి చేదుగా మారతాయి. వీటిని తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి