మీరూ పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఆగండాగండీ..
22 January 2025
TV9 Telugu
TV9 Telugu
వేరుశనగలను సామాన్యుడి జీడిపప్పుగా వ్యవహరిస్తారు. తక్షణ శక్తినిచ్చే వీటిలో పోషకాలూ అధికమే. ఆరోగ్యంతోపాటు సౌందర్యపోషణలోనూ ప్రధాన పాత్ర వహిస్తాయి
TV9 Telugu
పల్లీలను ఆరేడు గంటలు నానబెట్టి వాడుకుంటే తేలికగా జీర్ణమవుతాయి. పచ్చి వేరుశనగ పప్పులను తింటే మరీ మంచిది. వీటిలో కొలెస్ట్రాల్ జీరో. గుండె జబ్బులు తగ్గిస్తాయి. కండరాలకు బలాన్ని చేకూరుస్తాయి
TV9 Telugu
ఇందులో ఎక్కువ మొత్తంలో మాంసకృత్తులు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. మంచి కొవ్వులూ అధికమే. విటమిన్-ఇ, సి సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టుతోపాటు చర్మాన్నీ రక్షిస్తాయి
TV9 Telugu
పల్లీల్లోని సమ్మేళనాలు ఆందోళన, ఒత్తిళ్లను తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. ఈ శక్తిమంతమైన గింజలను తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా మారతాయి. వీటిల్లో విటమిన్లు, మినరల్స్ మెండుగా లభిస్తాయి
TV9 Telugu
కాపర్, ఫైబర్, విటమిన్ ఇ, భాస్వరం, మెగ్నీషియం సమృద్ధిగా ప్రోటీన్లు వేరుశెనగలో ఉంటాయి. అయితే చాలా మంది పల్లీలు తిన్న తర్వాత నీళ్లు తాగుతుంటారు. ఇలా చేస్తే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
వేరుశెనగలు తిన్న వెంటనే ఐస్ క్రీమ్, షికంజీ, లస్సీ, ప్లెయిన్ వాటర్ వంటి చల్లటి పదార్థాలు తీసుకోకూడదు. పల్లీలు వేడి స్వభావం కలిగి ఉంటాయి. అందుకే వీటిని తిన్న వెంటనే చల్లటి పదార్థాలు లేదా నీటిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి
TV9 Telugu
మరైతే ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? వేరుశెనగ తిన్న తర్వాత వేడి వేడి టీ తాగవచ్చని నిపుణులు అంటున్నారు. అయితే వేరుశెనగ తిన్న వెంటనే చల్లటి పదార్థాలు తినడం, తాగడం మాత్రం చేయకూడదు
TV9 Telugu
వేయించిన పల్లీలు ఎక్కువ పరిమాణంలో తింటే ఎసిడిటీ, అపానవాయువు, గ్యాస్ వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. అందువల్ల పరిమితంగా తినాలి. నానబెట్టి లేదా ఉడికించి తినడం ఆరోగ్యానికి మంచిది