పాలు బలవర్థకమైన ఆహారం అన్న సంగతి తెలిసిందే. అందుకే పుట్టగానే పిల్లలకు మొట్టమొదట అందే ఆహారం కూడా అదే. అయితే పిల్లలు పసితనంలో తాగే తల్లిపాల ద్వారా వారి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి
TV9 Telugu
పాలు పెద్దలకు కూడా ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే అశ్వగంధతో కలిపిన పచ్చి పాలను తాగడం వల్ల శరీరానికి మరింత మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
అశ్వగంధ కలిపిన పచ్చి పాలల్లో విటమిన్ డి, బి12, ఐరన్, కాల్షియం, ప్రోటీన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. పాలు, అశ్వగంధ రెండూ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి
TV9 Telugu
అశ్వగంధ ఒక అద్భుతమైన ఎనర్జీ బూస్టర్. ఇది శరీర బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. పాలలో కలిపి తాగడం వల్ల శరీరానికి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీని వినియోగం బలహీనత మరియు బద్ధకాన్ని తొలగిస్తుంది
TV9 Telugu
అశ్వగంధ ఒక సహజ ఒత్తిడి నివారిణి కూడా. ఇది మెదడులోని నరాలను ప్రశాంతపరుస్తుంది. రాత్రి పడుకునే ముందు అశ్వగంధను పచ్చి పాలలో కలిపి తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది
TV9 Telugu
అశ్వగంధలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. పచ్చి పాలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ అంశాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది వ్యాధులను నివారిస్తుంది
TV9 Telugu
పాలులో అశ్వగంధ కలపడం వల్ల ఇందులోని కాల్షియం, ప్రోటీన్ కండర ద్రవ్యరాశిని పెంచడంలో, కండరాల పునరుద్ధరణలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఎముకలను బలపరుస్తుంది
TV9 Telugu
ప్రతిరోజూ అశ్వగంధ పాలు తాగడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది