ఆకుకూరల్లో తోటకూర తర్వాత ఎక్కువగా వినిపించేది పాలకూర. పాలకూర తినడానికి కొందరు ఇష్టపడరు. కానీ దీనివల్ల బోలెడన్ని లాభాలున్నాయి
TV9 Telugu
పాలకూరలో ఒకటి కాదు. రెండు కాదు. దాదాపు 13 రకాల యాంటీయాక్సిడెంట్లున్నాయి. ఇవి క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. ఇందులో విటమిన్ కె ఎక్కువగా లభిస్తుంది
TV9 Telugu
పాలకూరలోని ఇనుము శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనతను కూడా నివారిస్తుంది. ఇందులో ఇనుము సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనతను తొలగిస్తుంది
TV9 Telugu
పాలకూరలోని పొటాషియం, నైట్రేట్లు సాధారణ రక్తపోటును నిర్వహించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. పాలకూరలోని వివిధ పోషకాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, కాలానుగుణ వ్యాధుల నుంచి రక్షిస్తాయి
TV9 Telugu
పాలకూరలోని విటమిన్లు ఎ, సి చర్మ కణాల పునరుత్పత్తికి సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి. చర్మం, జుట్టుకు సహజ కాంతిని తెస్తుంది
TV9 Telugu
ఫైబర్ అధికంగా ఉండే పాలకూర జీర్ణక్రియకు సహాయపడుతుంది. కాలేయం చురుకుగా పనిచేసేలా చేస్తుంది. పాలకూరలోని ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తికి సహాయపడతాయి. ఇది మెదడు పనితీరును పెంచుతుంది
TV9 Telugu
పాలకూరలోని యాంటీఆక్సిడెంట్లు గుండెలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులోని విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం ఎముకల నిర్మాణాన్ని బలోపేతం చేస్తాయి
TV9 Telugu
పాలకూరలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది. తద్వారా అతిగా తినే ధోరణిని తగ్గిస్తుంది