అమ్మాయిలూ.. జామ తింటున్నారా..? 

23 November 2025

TV9 Telugu

TV9 Telugu

పచ్చగా నవనవలాడే జామ పండుని చూసి మనసు పారేసు కోనివారెవరో చెప్పండి. అయితే, ఇది రుచిలోనే కాదు... పోషకాలను శరీరానికి అందించడంలోనూ మేటే

TV9 Telugu

జామపండులో పీచు ఎక్కువ. గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. అందువల్లే మనకు అకస్మాత్తుగా చక్కెర నిల్వలు పడిపోకుండా చేసి సమతుల్యంగా ఉంచుతుంది

TV9 Telugu

అలాగే రక్తపోటునూ అదుపులో ఉంచుతుంది. ఇందులోని ట్రైగ్లిజరాయిడ్లు చెడు కొవ్వుని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అన్ని కాలాల్లోనూ చవకగా దొరికే పోషకాల పండు జామ

TV9 Telugu

నెలసరి సమస్యలకు, గర్భిణులకు జామ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ పండు, ఆకుల్లో... విటమిన్‌ సి, లైకోపిన్, యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి. ఇవి క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి

TV9 Telugu

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు రోజూ ఓ పండు తింటే ఎంతో మేలు. జామకు ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ గుణం ఉంది. రక్తంలో చక్కెర స్థాయుల్నీ సమన్వయం చేసే శక్తి ఎక్కువ. అందుకే వీలైతే వీటి ఆకుల్నీ తినండి

TV9 Telugu

నెలసరి సమయంలో చాలామంది మహిళలు డిస్మెనోరియాతో బాధ పడుతుంటారు. వీరు జామ ఆకులు, పండ్లను తరచూ తింటుంటే... సమస్య దూరమవుతుంది

TV9 Telugu

వీటిలోని మెగ్నీషియం ఇతర పోషకాలను శరీరం సరిగా స్వీకరించేలా సాయ పడుతుంది. పీచు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. సోడియం, పోటాషియం నిల్వలు.. రక్తపోటుని అదుపులో ఉంచుతాయి

TV9 Telugu

జామలో ఉండే విటమిన్‌ ఎ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. క్యాటరాక్ట్‌ సమస్య రాకుండా అదుపు చేస్తుంది. ఇందులో గర్భిణులకు మేలు చేసే ఫోలిక్‌ యాసిడ్‌ కూడా ఎక్కువే