నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదన్న సంగతి తెలిసిందే. మస్యంతా తాగే విధానంలోనే. రుచి లేని నీటిని లీటర్ల కొద్దీ తాగాలంటే ఎవరికైనా ఇబ్బందే. అలా అని మానేస్తే... రోగాలు వస్తాయి
TV9 Telugu
అందుకే కళ్లు మూసుకుని గడగడా తాగేస్తారు కొందరు. వాటికి రుచులు కలిపి తాగడానికి ప్రయత్నిస్తారు ఇంకొందరు. అంతేనా, ఎనిమిది గ్లాసుల నియమం పెట్టుకుని రాత్రయ్యేలోపు దాన్ని పూర్తిచేయడమే పనిగా పెట్టుకుంటారు
TV9 Telugu
నీళ్లు మన శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా, అవయవాలు సక్రమంగా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది. అయితే నీళ్లు తాగడానికంటూ ఓ సరైన పద్ధతి ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
ఉదయం లేవగానే గ్లాసు నీళ్లు పక్కాగా తాగుతారు. తర్వాత ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగొచ్చులే అంటూ నిర్లక్ష్యం చేస్తారు. దాహం వేయడం అంటే మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురైనట్లేగా... అందుకే గంటకో, రెండు గంటలకో నీళ్లు తాగేలా ప్రణాళికలు వేసుకోండి
TV9 Telugu
ఎలా తాగుతున్నాం అనేది కూడా ముఖ్యమే. నిల్చొని, నిటారుగా కూర్చుని... నెమ్మదిగా కాఫీ, టీలను ఎలా అయితే ఆస్వాదిస్తూ సిప్, సిప్‌గా తాగుతామో... నీటిని కూడా అలానే తాగాలట
TV9 Telugu
అప్పుడే ఫలితం ఉంటుందని చెబుతుంది ఆయుర్వేద శాస్త్రం. ఇలా తాగడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకూ ద్రవాలు సరిగ్గా ప్రవహిస్తాయట
TV9 Telugu
ముఖ్యంగా నిలబడి నీళ్లు తాగడం వల్ల మోకాళ్లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపి, మోకాళ్లు దెబ్బతింటాయనే ప్రచారం కూడా ఉంది. నిజానికి ఇలా తాగడం వల్ల మోకాలికి ఎలాంటి ప్రమాదం లేదు
TV9 Telugu
నిలబడి నీళ్లు తాగడం వల్ల అది త్వరగా అన్నవాహిక ద్వారా నేరుగా కడుపులోకి వెళుతుంది. ఇది అజీర్ణం లేదా అసౌకర్యాన్ని కలిగించవచ్చు. కాబట్టి కూర్చుని నెమ్మదిగా నీళ్లు తాగడం మంచిది