జెల్లీలా నోరూరించే లిచీ పండ్లు.. వీరికి విషంతో సమానం!
16 May 2025
TV9 Telugu
TV9 Telugu
ఎరుపు, తెలుపు మేళవింపుతో జెల్లీలా కనిపిస్తూ తెగ నోరూరించే లీచీ పండ్లు.. మనకి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తాయి. చినుకులు మొదలయ్యాయి. వాటితోపాటే బోలెడు ఇన్‌ఫెక్షన్లూ పలకరిస్తాయి. వాటి బారిన పడొద్దంటే రోగనిరోధకత పెంచుకోవాల్సిందే
TV9 Telugu
లిచీలో విటమిన్- సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడంలో సాయపడుతుంది. బి విటమిన్లు, ఫ్లావనాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. రక్తకణాల ఉత్పత్తికి ఇవి సాయపడతాయి
TV9 Telugu
అందుకే నెలసరి మొదలైన అమ్మాయిలకు వీటిని తప్పక ఇవ్వమంటారు. ఇంకా మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, ఫోలేట్ వంటి ఖనిజలవణాలకు ఇది మంచి వనరు. పైగా రుచీ బాగుంటుంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో తప్పక ఇవ్వాల్సిన పండ్లలో వీటినీ ఒకటిగా చెబుతారు
TV9 Telugu
లీచీలో విటమిన్ సి, రాగి, పొటాషియం, సహజ చక్కెర, పిండి పదార్థాలు, ఫైబర్ అధిక మొత్తంలో లభిస్తాయి. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి అనేక విధాలుగా సహాయపడతాయి
TV9 Telugu
లిచీలో విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది
TV9 Telugu
అయితే ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు లీచీ పండ్లు అస్సలు ముట్టుకోకూడదు. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నించేవారు దూరంగా ఉండాలి. లిచీకి సహజమైన తీపి ఉంటుంది. అందువల్ల డయాబెటిక్ రోగులు దీనిని తక్కువగా తినాలి
TV9 Telugu
ఎందుకంటే దీని కారణంగా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అంతేకాకుండా కొంతమందికి లిచీ తింటే అలెర్జీ రావచ్చు. దీనితో పాటు వారికి దురద, పెదవులు, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీలు ఉండవచ్చు. వీరు లీచీకి దూరంగా ఉండాలి
TV9 Telugu
ఎక్కువగా లిచీ తింటే ఒంట్లో తక్కువ రక్తపోటుకు కారణమవుతుంది. అందుకే పరిమిత పరిమాణంలో మాత్రమే దీనిని తీసుకోవాలి. రోజుకు 3 నుంచి 4 లిచీలు తినడం మంచిది