చలికాలంలో ఆరోగ్యానికి రక్ష ఈ పువ్వు.. కనిపిస్తే వదలకండీ!

13 November 2025

TV9 Telugu

TV9 Telugu

కుంకుమ పువ్వు... కుంకుమ రంగులో ఉండటం వల్ల దీనికా పేరొచ్చింది. ఇది చాలా ఖరీదైంది. మనదేశంలో కశ్మీర్‌ ప్రాంతంలో పండుతుంది. దీంట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ

TV9 Telugu

సాధారణంగా కుంకుమ పువ్వు మొక్క చాలా చిన్నగా ఉంటుంది. పూలకుండే కేసరాల నుంచే ఈ కుంకుమ పూ రేకలను సేకరిస్తారు

TV9 Telugu

ఈ పువ్వులోని సువాసనలు ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి హాయిగా నిద్ర పట్టేలా చేస్తాయి. దీని రుచి ప్రత్యేకంగా ఉంటుంది. అంతే కాదు దీన్ని తరచూ తీసుకోవడం వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది

TV9 Telugu

కంటి చూపును కాపాడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. పంటి నొప్పిని దూరం చేస్తుంది. సువాసనలతోపాటు శరీరానికి శక్తినీ ఇస్తుంది

TV9 Telugu

నెలసరి సక్రమంగా రానివారు రెండు కుంకుమ పూ రేకలను గోరువెచ్చని పాలలో వేసుకుని తాగితే ఫలితం ఉంటుంది. ఈ పువ్వును తరచూ తీసుకుంటే రక్తస్రావం చక్కగా అవుతుంది. మన దేశంలో ఎక్కువగా దీన్ని వంటకాల్లో వాడతారు

TV9 Telugu

ఆహారంగా, ఆరోగ్యపరంగానే కాదు సౌందర్య ఉత్పత్తుల తయారీలోనూ దీన్ని వాడకం అధికమే. జలుబుతో బాధపడేవారు గోరువెచ్చని పాలలో చిటికెడు వేసి తాగితే కాస్త ఉపశమనంగా ఉంటుంది

TV9 Telugu

అలాగే రోజు పాలతో తీసుకుంటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందట. గర్భాశయంలో కదలికలను సులభతరం చేయడానికి ఈ పువ్వు సాయం చేస్తుంది

TV9 Telugu

కుంకుమ పువ్వు నిత్యం ఆహారంలో చేర్చుకుంటే గ్యాస్‌, కడుపులో మంట, అజీర్తి, మలబద్ధకం... లాంటి సమస్యలు తగ్గిపోతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండె సమస్యలకు చెక్‌ పెడుతుంది