చిటపట చినుకులు పడుతుంటే మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని వేడివేడిగా తింటుంటే ఆ మజానే వేరు. ఇవి రుచిగా ఉండటమే కాదు, ఎన్నో పోషకాలనూ అందిస్తాయి. మొక్కజొన్న గింజల్లో నీటిలో కరగని పీచు బోలెడంత ఉంటుంది
TV9 Telugu
అందువల్ల ఆలస్యంగా జీర్ణమవుతాయి. ఫలితంగా రక్తంలో గ్లూకోజు నెమ్మదిగా కలుస్తుంది. మొక్కజొన్న కాల్చుకొని, ఉడికించి, పచ్చిగా ఎలాగైనా తినొచ్చు
TV9 Telugu
కార్న్ ఫ్లేక్స్, పాప్‌కార్న్ రూపంలోనూ వీటిని లాగించేయొచ్చు. మొక్కజొన్నలో కరగని పీచు దండిగా ఉండటం వల్ల మలం ఏర్పడేలా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది
TV9 Telugu
గింజల లోపలి పలుకుల్లో ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు, పీచు, ప్రోటీన్, ఫైబర్, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని శరీరం బాగా జీర్ణం చేసుకుంటుంది. కానీ సెల్యులోజ్‌తో కూడిన వెలుపలి గట్టి భాగం జీర్ణం కాదు. ఇది పేగుల్లో పులిసిపోతుంది
TV9 Telugu
కొంతమంది వీటిని ఉడకబెట్టి తింటే, మరికొందరు వీటిని కాల్చుకుని తింటారు. అయితే ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందో నిపుణుల మాటల్లో మీకోసం..
TV9 Telugu
నిపుణుల ప్రకారం.. ఉడకబెట్టిన మొక్కజొన్న తినడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. అదే నిప్పులపై కాల్చి తింటే పోషకాలు అందుతాయి. అయితే వీటిని గ్యాస్ మీద కాల్చడం ఆరోగ్యానికి హానికరం
TV9 Telugu
ఏదైనా ఆహారాన్ని ఉడకబెట్టినప్పుడు, ఈ ప్రక్రియలో కొన్ని పోషకాలు కోల్పోవచ్చు. మీరు మొక్కజొన్నను ఉడకబెట్టినప్పుడు, దానిని ఎక్కువగా ఉడకనీయకుండా చూడాలి. అంటే తక్కువగా ఉడకబెట్టాలి. వీలైతే ఆవిరిలో ఉడికించాలి
TV9 Telugu
మొక్కజొన్న ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. ప్రోటీన్-ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది కళ్ళు, చర్మానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. గుండెకు కూడా మంచిది