పనస తొనలు తిన్న వెంటనే నీళ్లు తాగారో.. చిక్కుల్లో పడతారంతే!

27 May 2025

TV9 Telugu

TV9 Telugu

వేసవిలో అధికంగా దొరికే పండ్లలో పనస కూడా ఒకటి. పండిన పనస తొనలు భలే రుచిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి బోలెడన్ని లాభాలు చేకూరుస్తాయి

TV9 Telugu

ముఖ్యంగా పండిన పనసలో విటమిన్లు, ఫొలేట్‌, నియాసిన్‌, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. పండ్లతో పోలిస్తే అధికంగా ఉండే ఫైబర్‌ జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది

TV9 Telugu

అల్సర్‌, మధుమేహాం, గుండెపోటు, రక్తపోటు తదితర సమస్యలు దూరమవుతాయి. అయితే ఈ పండును సరైన రీతిలో మాత్రమే తినాలి. లేదంటే లేనిపోని సమస్యలు వచ్చిపడతాయి. ఇందులో విటమిన్లు ఎ, సితోపాటు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి

TV9 Telugu

పండిన పనసకాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే పనస తొనలు ఖాళీ కడుపుతో తినడం అంత మంచిది కాదు

TV9 Telugu

మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో పనస పండు తినడం మంచిది. తద్వారా ఎలాంటి జీర్ణ సమస్యలు దరిచేరవు. అలాగే ఒకేసారి అధిక మొత్తంలో పనస తొనలు తినడం కూడా అంత మంచిది కాదు. ఒకేసారి 5-6 తొనలు తినేస్తే అజీర్ణం, గుండెల్లో మంట వస్తాయి.

TV9 Telugu

పనస పండులోని మెగ్నీషియం, కాల్షియం ఎముకలను బలంగా ఉంచడంలో, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. పండిన పనసకాయను రిఫ్రిజిరేటర్‌లో ఉంచి తింటే రుచి రెట్టింపు అవుతుందట. శరీరాన్ని కూడా చల్లగా ఉంచుతుంది

TV9 Telugu

పనస బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులోని  ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. దీంతో తరచుగా ఆకలిగా అనిపించదు. పనసకాయ చర్మం. జుట్టుకు కూడా మేలు చేస్తుంది

TV9 Telugu

పనస తిన్న తర్వాత నీళ్లు తాగడం మర్చిపోవద్దు. అయితే వీటిని తిన్న కనీసం 30 నిమిషాల తర్వాత మాత్రమే నీళ్లు తాగాలి. పొరబాటున పనస తిన్న వెంటనే నీళ్లు తాగారో కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి