వేసవిలో విరివిగా దొరికే పండ్లలో పనస కూడా ఒకటి. పండిన పనస తొనలతో రుచి మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. ఇతర పండ్లతో పోలిస్తే విటమిన్లు, ఫొలేట్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి
TV9 Telugu
దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. అల్సర్, మధుమేహాం, గుండెపోటు, రక్తపోటు తదితర సమస్యలు దూరమవుతాయి
TV9 Telugu
ఇందులో ఉండే సి విటమిన్ చర్మం, శిరోజాలను సంరక్షిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేసే ఫైటో న్యూట్రియంట్స్ పనసలో పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ సమస్యని కూడా దూరం చేస్తుంది
TV9 Telugu
ఖనిజాలు, లవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించటమే కాక బరువును అదుపులో ఉంచుతుంది
TV9 Telugu
ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫుడ్ అలర్జీ ఉన్న వారు పనస పండుకి దూరంగా ఉంటేనే మంచిదట
TV9 Telugu
దీంట్లో ఉండే క్యాల్షియం ఎముకలు గట్టిపడేలా చేసి, విరగకుండా కాపాడుతుంది. పచ్చి పనసతో బిర్యాని కూడా చేస్తారు. పనస పండు గింజలను ఇష్టంగా తింటారు. వీటిల్లో ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి
TV9 Telugu
పండిన పనస తొనలు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కణాలను కూడా సజీవంగా ఉంచుతుంది. ఇది వేడి పండు కాబట్టి, ఖాళీ కడుపుతో తినడం అంత మంచిది కాదు. ఇందులోని కాల్షియం, ఇతర ఖనిజాలు ఎముకలను బలపరుస్తాయి
TV9 Telugu
జాక్‌ఫ్రూట్‌లోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులోని తక్కువ గ్లైసెమిక్ సూచిక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిస్ రోగులు తక్కువ పరిమాణంలో పనస తొనలు తినవచ్చు