రాత్రి మిగిలిపోయిన చద్ది చపాతీ మీరూ పడేస్తున్నారా?

05 September 2025

TV9 Telugu

TV9 Telugu

చపాతీలు మెత్తగా, మృదువుగా చేయడం ఒక కళ. చాలామందికి చేసే విధానం సరిగ్గా తెలియకపోవడం వల్ల అవి గట్టిగా వస్తాయి. దీంతో ఇంట్లో రాత్రి చేసిన చపాతీలు మిగిలిపోతాయి

TV9 Telugu

కొంత మంది పిండి మెత్తగా, మృదువుగా చేసి, చపాతీలు చేసినా.. ఒక్కోసారి మిగిలిపోతుంటాయి. ఇలా మిగిలిపోయిన చపాతీలను చాలా మంది పడేస్తుంటారు. ఇకపై అలా చేయకండి. ఎందుకంటే ఇలా చద్దిపోయిన చపాతీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయట

TV9 Telugu

ఆయుర్వేదం ప్రకారం పాత చపాతీ శరీరానికి వివిధ ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ చపాతీ శరీరానికి చల్లదనాన్ని తెస్తుంది. వేసవిలో దీన్ని తినడం వల్ల హాయిగా ఉంటుంది. ఇది కొంతవరకు ఆమ్లత్వాన్ని, జీర్ణ వేడిని కూడా తగ్గిస్తుంది

TV9 Telugu

అలాగే చద్ది చపాతీలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని రెసిస్టెంట్ స్టార్చ్ పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది

TV9 Telugu

రెసిస్టెంట్ స్టార్చ్ మంచి బ్యాక్టీరియాకు నచ్చిన ఆహారం. ఇది పేగు ఆరోగ్యం, శోషణను మెరుగుపరుస్తుంది. అంతకాకుండా ఈ చపాతీలో తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది

TV9 Telugu

దీన్ని ఉదయం పూట తినడం వల్ల రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులను (గ్లైసెమిక్ స్పైక్స్) తగ్గిస్తుంది. మిగిలిపోయిన చపాతీని పెరుగు లేదా పాలతో కలిపి తినడం వల్ల పేగులు శుభ్రపడి జీర్ణక్రియ మెరుగుపడుతుంది

TV9 Telugu

అలాగే, దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల అధిక రక్తపోటు కొంతవరకు నియంత్రణలో ఉంటుంది. చపాతీలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఉంటాయి. అందుకే మిగిలిపోయిన చపాతీ తినడం వల్ల శరీరానికి శక్తి అధికంగా లభిస్తుంది. మలబద్ధకం నివారిస్తుంది

TV9 Telugu

అయితే ఒకటి రెండు రోజులు నిల్వ ఉంచిన చపాతీ తినవచ్చు. కానీ పాచిపోయిన వాసన ఉంటే మాత్రం తినకపోవడమే మంచిది. ఒకటి కంటే ఎక్కువ రాత్రులు ఉంచిన చపాతీ తినడం అంత సురక్షితం కాదు