మీరూ ఖాళీ కడుపుతో నెయ్యి తినేస్తున్నారా?

03 September 2025

TV9 Telugu

TV9 Telugu

వేడివేడి అన్నంలో కాస్త పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుంది? తినేటప్పుడు మొదటి ముద్దలో రెండు చుక్కలు నెయ్యి కలుపుకొని తింటే ఆ రుచే వేరు..

TV9 Telugu

నెయ్యి.. తిన్నది త్వరగా జీర్ణమయ్యేలా చేయడమే కాదు.. గ్యాస్‌ సంబంధిత సమస్యలనూ దరి చేరనివ్వదు. నెయ్యిలో మంచి కొవ్వు ఉంటుంది. ఇది విటమిన్లు A, D, E, K లకు కూడా మంచి మూలం

TV9 Telugu

ఇది కడుపులో పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది

TV9 Telugu

ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రతిరోజూ ఒక చెంచా నెయ్యి తినడం మంచిదని సూచిస్తున్నారు. అయితే ఇది అందరికీ ప్రయోజనకరం కాదు. దీన్ని ఎవరు తినాలి, ఎవరు తినకూడదో చూడా తెలుసుకోవాలి

TV9 Telugu

ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం ఉన్నవారు నెయ్యి తినకూడదని నిపుణులు అంటున్నారు. ఇక సన్నగా ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందట

TV9 Telugu

ఇది చర్మం నుంచి జీర్ణక్రియ వరకు ప్రతిదీ మెరుగుపడేలా చేస్తుంది. నెయ్యిలో కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేస్తుంది. చర్మ అలెర్జీల నుంచి కూడా రక్షిస్తుంది

TV9 Telugu

జీర్ణక్రియను మెరుగుపరచడానికి నెయ్యి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది

TV9 Telugu

గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నెయ్యి చర్మానికి, జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ నిపుణుల సూచనల మేరకు మాత్రమే రిమిత పరిమాణంలో తీసుకోవాలి