పేగు క్యాన్సర్‌కి పెరుగుతో విరుగుడు.. ఇంతకీ మీరు తింటున్నారా?
12 June 2025
TV9 Telugu
TV9 Telugu
కాలం ఏదైనా పెరుగు తింటే చలవే చేస్తుంది. జలుబు చేస్తుందనో, లావైపోతామనో పెరుగుని పూర్తిగా దూరం పెడతారు కొందరు. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకునే వారి జీవితకాలం పెరిగిందని అధ్యయనాల్లో తేలింది
TV9 Telugu
అంతేకాదు యవ్వనంగా కూడా ఉండొచ్చంటున్నారు నిపుణులు. పెరుగులో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లు ఉంటాయి. శరీరంలో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరచి మలబద్ధకాన్ని అదుపులోకి తెస్తాయి
TV9 Telugu
పెరుగు రోజూ తీసుకుంటే ఇందులోని ప్రోబయోటిక్స్ మూత్రపిండాల వ్యాధులను అదుపులో ఉంచుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయులను తగ్గించి, రక్త సరఫరాను సమన్వయం చేస్తాయి
TV9 Telugu
శరీరాకృతిని చక్కగా ఉంచేందుకు వ్యాయామాలు చేసేవారు పెరుగు రోజూ తీసుకోండి. దీనిలో ఉండే ప్రోటీన్లు మంచి ఫలితాన్నిస్తాయి. కడుపునొప్పితో సహా ఇతర ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా పెరుగుని చికిత్స కోసం ఉపయోగిస్తారు
TV9 Telugu
డయేరియాని కూడా నయం చేస్తుంది. నెలసరి సమయంలో పెరుగు తప్పనిసరిగా తీసుకోవటం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. తరచూ పెరుగు తినటం జీర్ణకోశం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందని.. ఎముకలు గుల్లబారటం, మధుమేహం ముప్పులూ తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి
TV9 Telugu
వారానికి రెండు, అంతకన్నా ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి పెద్ద పేగు క్యాన్సర్.. ముఖ్యంగా కుడివైపున వచ్చే క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది
TV9 Telugu
పెద్ద పేగులో ఎడమ వైపున వచ్చే క్యాన్సర్ కన్నా కుడి వైపు క్యాన్సర్ తీవ్రమైంది కావటం గమనార్హం. పేగుల్లోని బ్యాక్టీరియా సమతులంగా ఉండటానికి పెరుగులోని బ్యాక్టీరియా తోడ్పడటం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గటానికి వీలవుతోందని భావిస్తున్నారు
TV9 Telugu
ఆహారం, పేగు బ్యాక్టీరియా, పెద్దపేగు క్యాన్సర్ మధ్య గల సంబంధాన్ని తాజా అధ్యయనాలు గట్టిగా నొక్కి చెబుతున్నాయి. కాబట్టి ప్రతిరోజూ మీ ఆహారంలో పెరుగు తప్పక చేర్చుకోండి