మిమ్మల్నే వింటున్నారా? చలికాలంలో బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా

16 December 2024

TV9 Telugu

TV9 Telugu

రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం... ఇది బొప్పాయితో లాభం. అయితే రోజులో ఎప్పుడైనా కాకుండా రోజుని బొప్పాయితోనే ప్రారంభిస్తే ఆరోగ్యానికి చాలా మేలంటున్నారు నిపుణులు

TV9 Telugu

బొప్పాయిలో విటమిన్ ఎ, సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్ పపైన్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

ఆయుర్వేదంలో బొప్పాయి వేడి పండు అని పిలుస్తారు. అందుకే ఈ పండును చలికాలంలో ఎక్కువగా తింటుంటారు. నిపుణుల అభిప్రాయం ఇది

TV9 Telugu

శీతాకాలంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే బొప్పాయిని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది

TV9 Telugu

చలికాలంలో బరువు పెరుగుతారని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో బొప్పాయిని తీసుకోవడం ద్వారా బరువు అదుపులో ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

TV9 Telugu

జీర్ణ సమస్యలు ఉన్నవారు బొప్పాయిని తప్పనిసరిగా తినాలి. దీన్ని తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటివి దరిచేరవు. దీన్లో అధిక మోతాదులో ఫైబర్‌ ఉండటంవల్ల పరగడుపున తింటే మలబద్ధకాన్ని పోగొడుతుంది

TV9 Telugu

అజీర్తిని తగ్గిస్తుంది. పీచు పదార్థంవల్ల త్వరగా ఆకలి వేయదు. క్యాలరీలూ తక్కువ. కాబట్టి బరువుని తగ్గిస్తుంది. ఉదయాన్నే తింటే శరీరంలోని మలినాల్ని బయటకు పంపి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది

TV9 Telugu

బొప్పాయి తినడానికి ఉత్తమ సమయం ఉదయం. ఉదయం పూట అల్పాహారంలో బొప్పాయి తినవచ్చు.  అంతేకాదు, దీన్లో పొటాషియం గుండె జబ్బుల్ని తగ్గిస్తే లైకోపీన్‌ చర్మానికి నిగారింపు తెస్తుంది