వీటిని గుర్తుపట్టారా? ఒక్కటి తిన్నా జీవితంలో క్యాన్సర్‌ రాదట!

25 June 2025

TV9 Telugu

TV9 Telugu

తియ్యటి రుచితో.... అందుబాటు ధరలో దొరికే చిలగడదుంపల్లో పోషకాలు ఎక్కువే. వీటిని క్రమం తప్పక తింటే... పోషకాహార లేమిని అధిగమించొచ్చు

TV9 Telugu

చిలగడ దుంపల్లో బీటా-కెరొటిన్‌, విటమిన్‌-ఈ, సి, బి-6, పొటాషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులూ తీసుకోవచ్చు

TV9 Telugu

ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతర్గత అవయవాల వాపుని తగ్గిస్తాయి. ఫైబ్రినోజెన్‌ రక్తం గడ్డకట్టకుండా సాయపడుతుంది

TV9 Telugu

ఇందులో ఉండే కెరొటినాయిడ్స్‌, విటమిన్‌ ఏ వంటివి కంటిచూపుని మెరుగుపరుస్తాయి. వ్యాధినిరోధక శక్తి పెంపొందిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్య ఛాయల్నీ తగ్గిస్తాయి

TV9 Telugu

ఈ దుంపల్లో మనకి అవసరమైన ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇది శరీర కణాల సామర్థ్యాన్ని పెంచి అన్ని భాగాలకు ఆక్సిజన్‌ సరఫరాని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థకు కీలకమైన తెల్లరక్తకణాల ఉత్పత్తికి సాయపడతాయి

TV9 Telugu

పొట్ట ఆరోగ్యానికి ఈ దుంపలోని పీచు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంతోపాటు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

TV9 Telugu

చిలగడ దుంప కండరాల కదలికలకీ, ఎముకల బలానికీ సాయపడుతుందట. దుంపల జోలికే వెళ్లరు మధుమేహులు. కానీ గ్లైసమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండే ఈ తీపి గడ్డని హాయిగా తినొచ్చు

TV9 Telugu

రక్తంలో చక్కెర స్థాయుల్ని క్రమబద్ధం చేస్తూ పీచును అందిస్తుంది కాబట్టి దీంతో ఎలాంటి ఇబ్బందీ ఉండదట. క్యాన్సర్లను తిప్పి కొట్టే యాంటీ ఆక్సిడెంట్లు దీంట్లో ఎక్కువే. ఊదా రంగులోని దుంపలో ఇవి పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇది దీర్ఘకాలిక వ్యాధుల్ని అరికడుతుంది కూడా