మామిడిపండ్లకోసం వేసవి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారే కాదు... శీతకాలంలో వచ్చే సీతాఫలాల కోసం వేయికళ్లతో వేచి ఉండేవారూ ఎక్కువే
TV9 Telugu
ఇవి రుచిలోనే కాదు... ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. సీతాఫలాల్లోని విటమిన్ సి, ఫోలేట్‌లు రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతాయి
TV9 Telugu
ఇందులోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణప్రక్రియ సరిగా జరిగేలా చేస్తుంది. అంతేకాదు, ఇది తీపి తినాలనే కోరికను తగ్గించి బరువుతో పాటు PCOS సమస్యనీ అదుపులో ఉంచుతుంది
TV9 Telugu
ఈ ఫలంలో పుష్కలంగా లభించే బి6.. సెరటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్లను ఉత్పత్తి చేయడానికి సాయపడుతుంది. మానసిక ఆందోళనల్ని నియంత్రిస్తుంది
TV9 Telugu
మహిళలకు వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో బలం తగ్గుతుంది. ఇందుకోసం సీతాఫలం తింటే సరి. వీటిల్లోని కాల్షియం, మెగ్నీషియం ఆ పనిచేస్తాయి
TV9 Telugu
గర్భధారణ సమయంలోనే కాదు, ప్రసవానంతరం కూడా తగిన శక్తిని అందించేందుకు సీతాఫలం తింటే మంచిది. దీనిలో ఇనుము, కాల్షియం వంటివి త్వరగా కోలుకునేలా చేస్తాయి
TV9 Telugu
ప్రసవానంతర వాపుల్ని తగ్గిస్తాయి. చూడగానే నోరూరించే సీతాఫలం రుచిలోనూ మేటే. ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరానికి శక్తినీ అందిస్తుంది
TV9 Telugu
అలాగని ఎక్కువ తినడమూ శ్రేయస్కరం కాదు. ఈ పండ్లు ఎక్కువగా తినడం వల్ల కడుపులో ఫైబర్ స్థాయులు పెరిగిపోయి.. జీర్ణశక్తి మందగిస్తుంది. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి