ఈ పానియం ఖాళీ కడుపుతో తాగితే.. రిచ్‌ బెనిఫిట్స్‌!

23 October 2025

TV9 Telugu

TV9 Telugu

అనాస అంటే అందరికీ తెలియకపోవచ్చు ఎందుకంటే దీన్ని పైనాపిల్‌ అన్న పేరుతోనే ఎక్కువగా పిలుస్తారు. చిన్న పొదలాంటి మొక్కకు కాసే ఈ పైనాపిల్‌ పెద్దగా ఎవరూ కొనరు

TV9 Telugu

ముళ్లూ, ఆకులతో ఉండే చిత్రమైన ఆకారం- చాలామందికి దాన్ని దూరం చేస్తుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుందనీ, కోయడం కష్టమనీ చెబుతూ కొందరు అసలు దాని వంకే చూడటం మానేస్తారు

TV9 Telugu

పైనాపిల్‌ పోషకాల గని. తక్కువ క్యాలరీలుండే ఈ పండులో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్‌ ముక్కలు తింటే మనకు రోజు మొత్తంలో అవసరమైన విటమిన్‌ సి దొరికినట్టే

TV9 Telugu

ముఖ్యంగా సీజనల్‌ వ్యాధులను తరిమికొట్టడంలో ఇది భలేగా పని చేస్తుంది. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలకు పైనాలపిల్‌తో తయారు చేసిన స్పెషల్ డ్రింక్‌ తాగడం వల్ల జీర్ణ సమస్యలకు కూడా సహాయపడుతుంది

TV9 Telugu

కీరదోస, పైనాపిల్, అల్లంతో తయారు చేసిన ఈ వర్షాకాలంలో ఎన్నో సమస్యలకు అమృతం లాంటిది. దీని రుచి తీపిగా, పుల్లగా భలేగా ఉంటుంది

TV9 Telugu

పైనాపిల్‌లోని విటమిన్ సి, ఖనిజాలు వ్యాధి నిరుధకతను పెంచుతుంది. అల్లం వాపును తగ్గించడంలో సహాయపడటంతోపాటు జలుబు, దగ్గుకు అల్లం ప్రయోజనకరంగా ఉంటుంది

TV9 Telugu

ఇది జీర్ణక్రియను పెంచుతుంది. శరీరం నుంచి విషాన్ని కూడా తొలగిస్తుంది. ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

TV9 Telugu

కీర దోస, పైనాపిల్ ముక్కలు, 1 అంగుళం అల్లం, కొంచెం నీరు కలిపి మిక్సర్‌లో మెత్తగా చేసుకోవాలి. దీనికి కొంచెం నిమ్మరసం జోడించవచ్చు. మిశ్రమాన్ని వడకట్టి తాగొచ్చు. ఈ పానీయాన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం మంచిది