కొబ్బరి నీళ్లు ఒంటికి చలువ చేస్తాయన్న సంగతి తెలిసిందే. కానీ కొబ్బరి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యం, బలం, జ్ఞాపకశక్తిని అందించే పదార్థాల్లో కొబ్బరి ఒకటి. ముఖ్యంగా పచ్చి కొబ్బరి తింటే బోలెడు లాభాలున్నాయి
TV9 Telugu
100 గ్రాముల పచ్చికొబ్బరి నుంచి 354 కెలొరీల శక్తి లభిస్తుంది. పిండిపదార్థాలు 15 గ్రా., కొవ్వులు 33 గ్రా., పీచు 10 గ్రా., అందుతాయి. పీచు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ లాంటి ఖనిజాలు దండిగా ఉంటాయి
TV9 Telugu
కొబ్బరిని తినడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు, మహిళలు... అందరూ తినొచ్చు. కొబ్బరిలో పిండిపదార్థం తక్కువగా, పీచు ఎక్కువగా ఉంటుంది. దాంతో రక్తంలో చక్కెరస్థాయులు నిలకడగా ఉంటాయి
TV9 Telugu
ముఖ్యంగా చలికాలంలో కొబ్బరిని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి శక్తిని అందిస్తుంది
TV9 Telugu
పచ్చి కొబ్బరిలో రాగి, సెలీనియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. చలి కాలంలో వెచ్చదనాన్ని నిర్వహించడానికి కొబ్బరి సహాయపడుతుంది
TV9 Telugu
ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, తద్వారా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను నివారిస్తుంది. కొబ్బరిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
TV9 Telugu
ఇది చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. కొబ్బరిలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ శరీరంలోని కొవ్వును వేగంగా కరిగించడంలో, ఆకలిని అణచివేయడంలో సహాయపడుతుంది
TV9 Telugu
దీని ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. శరీరంలో బలహీనత అంటే శక్తి లోపించడం, అలసటగా అనిపించడం మొదలైన సమస్యలు ఉంటాయి. బలహీనతను అధిగమించడానికి, పచ్చి కొబ్బరిని తినవచ్చు