చలికాలంలో క్యారెట్లు తింటే ఏమవుతుంది?

28 November 2025

TV9 Telugu

TV9 Telugu

రోజూ ఒక క్యారెట్‌ తింటే కంటిచూపు బాగుంటుందని అనేకసార్లు విని ఉంటాం. కానీ ఆ మాటను పెద్దగా పట్టించుకోక కళ్లజోళ్లు కొనితెచ్చుకుంటాం

TV9 Telugu

క్యారెట్లను శీతాకాలపు సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. అవి కంటి చూపుకు మేలు చేయడమేకాదు బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతాయి

TV9 Telugu

క్యారెట్‌లో ప్రొటీన్లు, పీచు, ఎ, బి1, బి6, సి, కె విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం అధికంగా ఉంటాయి

TV9 Telugu

క్యారెట్లలో దాదాపు 89 శాతం నీరు ఉంటుంది. అందువల్ల వాటిని తినడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచవచ్చు. క్యారెట్ సలాడ్‌లా తినడం మంచి పద్ధతి

TV9 Telugu

ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటితో ఎముకలు, దంతాలకు పటుత్వం వస్తుంది. తరచూ క్యారెట్లు తినేవారిలో క్యాన్సర్‌ వచ్చే అవకాశం తగ్గుతుంది

TV9 Telugu

చర్మం పొడిబారదు. ముఖానికి మెరుపునిస్తాయి. జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది. సమయానికి ఆకలి వేస్తుంది. మలబద్ధక సమస్య రాదు. వీటిలోని విటమిన్‌-ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది

TV9 Telugu

ఊబకాయం రాదు. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆహారం. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇవి రక్తపోటును క్రమబద్ధం చేస్తాయి. కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి

TV9 Telugu

క్యారెట్లతో కూర, పచ్చడి, హల్వా, జ్యూస్‌ చేయొచ్చు. ఫ్రైడ్‌రైస్, సాంబార్‌లకు అదనపు రుచి తెస్తాయి. సలాడ్, కేక్, కుకీస్, ఐస్‌క్రీమ్, చాక్లెట్లు, మిఠాయిల్లో క్యారెట్లను ఉపయోగిస్తారు. వీటిని ఉడికించి లేదా పచ్చివి కూడా తినొచ్చు