పసుపు పాలు ఎవరు తాగకూడదో తెలుసా..?

17 July 2025

TV9 Telugu

TV9 Telugu

పసుపును వంటింటి బంగారమని, గోల్డెన్‌ స్పైస్‌ అని చాలా మంది పిల్చుకుంటారు.. ఇందులో ఉన్న ఆరోగ్య సుగుణాలే అందుకు కారణం

TV9 Telugu

గోరు వెచ్చని పాలలలో చిటికెడు పసుపు కలిపి తాగితే ఎన్నో రోగాలు మటాష్‌. పసుపు పాలలో కాల్షియం, విటమిన్ డి, పొటాషియం, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి

TV9 Telugu

ఇందులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది శోథ నిరోధక, బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతేనా పసుపు పాలల్లో ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి

TV9 Telugu

కానీ కొంతమంది దీనిని తీసుకోకూడదు. పసుపు పాలు రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకే డయాబెటిస్ ఉన్న రోగులు వైద్యుడిని సంప్రదించకుండా పాలు తాగకూడదు

TV9 Telugu

ముఖ్యంగా పసుపు పాలు అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఎవరికైనా ఫ్యాటీ లివర్, హెపటైటిస్, ఇతర ఏదైనా కాలేయ సంబంధిత సమస్య ఉంటే వారు పసుపు పాలు తాగకూడదు

TV9 Telugu

పసుపు పాలలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను పెంచుతుంది. ఎవరికైనా ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే, పసుపు పాలు తాగడం వీరు తాగకపోవడమే మంచిది

TV9 Telugu

కొంతమంది పసుపు పాలు తాగిన తర్వాత కడుపులో చికాకు, గ్యాస్ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. ఎందుకంటే పసుపు వేడి స్వబావం అందరికీ సరిపోదు

TV9 Telugu

కొంతమందికి పసుపు లేదా పాలు అలెర్జీ ఉండవచ్చు. దీని వలన చర్మంపై దద్దుర్లు, దురద, వాపు వస్తుంది. అటువంటి పరిస్థితిలో పసుపు పాలు తాగడం ప్రమాదకరం. వీరు దూరంగా ఉండటమే మంచిది