వేసవిలో నిమ్మ రసం మంచిదే.. వీరికి మాత్రం యమ డేంజర్!
18 April 2025
TV9 Telugu
TV9 Telugu
నిమ్మకాయ ప్రసక్తి వస్తే .. ఆ ఏముందిలే పచ్చడికేగా అని లైట్ తీసుకుంటారు చాలా మంది. కానీ ఇదెంత మేలు చేస్తుందో తెలిస్తే మాత్రం వదలరు. నిమ్మకాయలో సి-విటమిన్ అధికంగా ఉంటుంది
TV9 Telugu
ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులోని సిట్రిక్ యాసిడ్ చర్మం ముడతలు పడకుండా, కిడ్నీలో రాళ్లేర్పడకుండా చేస్తుంది. ఇలా ఒకటేమిటి ఎన్నో పోషకాలు కలిగిన అద్భుతం ఇది
TV9 Telugu
ముఖ్యంగా వేసవిలో అధిక వేడి, ఉక్కపోత వల్ల చెమటలు పట్టడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడం ప్రారంభవుతుంది. అయితే నిమ్మ రసం గ్లాసుడు తాగితే ఈ మొత్తం బాధలన్నీ చిటికెలో ఎగిరిపోతాయి
TV9 Telugu
ఇందులోని విటమిన్ సి శరీరాన్ని చల్లబరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందుకే వేసవిలో చాలా మంది నిమ్మ రసం తాగుతుంటారు
TV9 Telugu
అయితే కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు ఎట్టిపరిస్థితుల్లోనూ నిమ్మ రసం తాగకూడదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా అధిక ఆమ్లత్వం ఉన్నవారు నిమ్మరసం అస్సలు తాగకూడదు
TV9 Telugu
అలాగే తరచుగా గుండెల్లో మంట, పుల్లని త్రేన్సులు, కడుపులో గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవారు నిమ్మ రసానికి దూరంగా ఉండాలి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ ఆమ్లం.. కడుపులో ఆమ్లతను మరింత పెంచి సమస్యను తీవ్రతరం చేస్తుంది
TV9 Telugu
కడుపులో అల్సర్ ఉంటే నిమ్మ నీళ్లు తాగడం అంత మంచిది కాదు. నిమ్మకాయలోని ఆమ్లం వ్రణోత్పత్తి ప్రాంతానికి మరింత నష్టం కలిగించవచ్చు. ఇది నొప్పి, చికాకును కూడా పెంచుతుంది
TV9 Telugu
నిరంతర కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా నిమ్మ రసం నివారించాలి. నిమ్మ రసం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఇది కీళ్లలో వాపు, నొప్పిని మరింత పెంచుతుంది. ఒకవేళ తాగవల్సి వస్తే తక్కువ పరిమాణంలో వేడి లేదా గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు