అరవై శాతం రుగ్మతలకు పోషకాల లోపమే ప్రధాన కారణం. ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మెదడుకు చురుకుదనాన్ని ప్రసాదిస్తుంది
TV9 Telugu
కానీ, ఇదంతా జరగాలంటే... తాజా కూరగాయలూ, పళ్లూ, సిరిధాన్యాలూ మన భోజనంలో భాగం కావాలి. పసుపు, అల్లం, వెల్లుల్లితోపాటు పలు రకాల కూరగాయలు ఆరోగ్యకరమైన పద్ధతిలో వండుకుని తినాలి
TV9 Telugu
ఏ ఒక్క కూరగాయలోనో, ఆకుకూరలోనో శరీరానికి అవసరమైన సమస్త పోషకాలూ లభించవు. ఎంత వైవిధ్యమైన ఆహారం తీసుకుంటే అంత మంచిది. మరొక్కమాట... ఖరీదైన కూరగాయలూ, విదేశీ ఫలాలతోనే పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమనే అపోహ వద్దు
TV9 Telugu
మన ఊళ్లో పండేవీ విలువైనవే. కూరగాయల్లో తక్కువ కేలరీలతో పాటు విటమిన్లు, ఖనిజాలు, అనేక యాంటీఆక్సిడెంట్లు పుష్కలగా ఉంటాయి. కొన్ని పండ్లను వాటి తొక్కలతో తినడం ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో, అదే విధంగా కొన్ని కూరగాయలను వాటి తొక్కలతో కలిపి తినాలి
TV9 Telugu
అటువంటి వాటల్లో ముఖ్యమైనది గుమ్మడికాయ. పచ్చి గుమ్మడికాయ తొక్క రుచిగా ఉంటుంది. పూర్తి పోషణను అందిస్తుంది
TV9 Telugu
చాలా మంది వంకాయ తొక్క ఇష్టపడరు. దీంతో దానిపై తొక్కను తొలగించి వంట చేస్తుంటారు. నిజానికి ఇది అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల వంకాయ పై తొక్క ఇకపై తొలగించకండి
TV9 Telugu
విటమిన్ సి అధికంగా ఉండే టొమాటో కూడా ఆహార రుచిని రెట్టింపు చేస్తుంది. అయితే వంటకు చాలా మంది దాని పై తొక్కను తొలగిస్తారు. అయితే దీనిని తొక్కతోనే తినాలి. ఇలా చేస్తే మరింత పోషకాలు అందిస్తుంది
TV9 Telugu
కీర దోస.. సాధారణంగా తొక్క తొలగించి ఎక్కువగా సలాడ్‌గా తింటుంటారు. తొక్క తీయకుండా తింటే ఎక్కువ పోషకాలు అందుతాయి. అలాగే కాకరకాయ రుచిలో చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి వరంలా భావించే చేదు పూర్తిగా తీయకుండా వంటకు వినియోగించాలి