గొర్రె మాంసం Vs మేకమాంసం.. ఏ మటన్ ఆరోగ్యానికి మంచిదంటే? 

09 october 2025

Samatha

మటన్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు మీరే చెప్పండి. ప్రతి ఒక్కరూ ముక్క ఉంటే చాలు ఒక్క ముద్ద ఎక్కువనే తింటారు. చికెన్, మటన్ చాలా ఇష్టంగా లాగించేస్తారు.

అయితే  మటన్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొంత మందిలో ఓ డౌట్ ఉంటుంది. అది ఏమిటంటే? గొర్రె మాంసం, మేక మాంసం ఆరోగ్యానికి ఏది మంచిది?

కాగా ఇప్పుడు మనం దాని  గురించే తెలుసుకుందాం. ఐరన్, జింక్,విటమిన్ బీ 12 వంటివి రెండింటిలో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఓమేగా 3 , ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

అందు వలన రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి, జుట్టు, చర్మ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ మాంసాహారం తీసుకుంటారు. అయితే మేక మాంసంలో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుందంట.

అందువలన మేక మాంసం తినడం వలన గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నవారు, మేక మాంసం కంటే గొర్రె మాంసం తినడమే మంచిదంట.

అంతే కాకుండా జీర్ణ సమస్యలు ఉన్న వారు కూడా మేక మాంసం కంటే గొర్రె మాంసం తినడం చాలా మంచిదంటున్నారు.  దీని వలన కడుపు నొప్పి  వంటి సమస్యలు దరిచేరవు.

ఇక గొర్రె మాంసంతో పోలిస్తే, మేక మాంసంలో ఐరన్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది.  అయితే రక్తహీనత సమస్యతో బాధపడే వారు  మేక మాంసం తినడం మంచిదంట.

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగినది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదు. పాఠకుల ఆసక్తిమేరకే ఇవ్వడం జరిగింది.