రాత్రంతా నీళ్లలో నానబెట్టిన అన్నం.. ఉదయం ఖాళీ కడుపుతో తిన్నారంటే..!

19 May 2025

TV9 Telugu

TV9 Telugu

మనిషి పుట్టుకకు, జీవనానికి అన్నమే మూలం. అందుకే ఉపనిషత్తులు అన్నాన్ని ‘ప్రజాపోషకం’ అన్నాయి. మనిషి అన్నప్రాణి. కాబట్టి మనల్ని పోషించే అన్నాన్ని త్రికరణ శుద్ధిగా గౌరవించి, భుజించాలి

TV9 Telugu

ఆకలి తీర్చుకోవడానికి భోజనం ఎంత ముఖ్యమో పద్ధతిగా తినడం కూడా అంతే ముఖ్యం. పరిశుభ్రమైన ఆహారాన్ని తినాల్సిన పద్ధతిలో తింటే రోగాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మంచి ఆహారంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది

TV9 Telugu

భోజనానికి సమయపాలనతో పాటు తృప్తిగా తినడమన్నది కూడా చాలా ముఖ్యం. అయితే మీరెప్పుడైనా రాత్రిపూట మిలిగిన అన్నాన్ని నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తిన్నారా? ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

దీన్ని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో అన్నాన్ని ఈ విధంగా ఎక్కువగా తింటారు. ఇక్కడ దీనిని 'బాసి' అనే పేరుతో పిలుస్తారు. అక్కడి ప్రజలు దీనిని ఆరోగ్యానికి ఒక వరంగా భావిస్తారట

TV9 Telugu

ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. ఈ విధంగా అన్నం తినడం శరీరానికి చాలా మేలు చేస్తుందని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఒక రకమైన పులియబెట్టిన ఆహారంగా మారుతుంది. ఇది మన జీర్ణవ్యవస్థకు గరిష్ట ప్రయోజనాన్ని అందిస్తుంది

TV9 Telugu

మీరు తినడానికి రెండు గంటల ముందు రాత్రంతా నానబెట్టిన వండిన బియ్యాన్ని పెరుగుతో కలిపి పెట్టుకోవాలి. అది పులియబెట్టబడుతుంది. ఇది ఆరోగ్యానికి ప్రయోజనాలను రెట్టింపు చేస్తుందని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

రాత్రంతా నీటిలో నానబెట్టిన అన్నం తినడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం, అజీర్ణం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులోని వేడిని తగ్గిస్తుంది. వేసవిలో దీన్ని తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి

TV9 Telugu

వేసవిలో వండిన అన్నాన్ని రాత్రంతా నీటిలో నానబెట్టి, పెరుగుతో కలిపి తినడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. దీని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది తీవ్రమైన వేడిలో కూడా కడుపుని చల్లగా ఉంచుతుంది. కొల్లాజెన్ కూడా పెరుగుతుంది