నెల పాటు మిల్క్ టీ ఆపేస్తే.. మీ ఒంట్లో జరిగే మార్పు ఇదే!
18 June 2025
TV9 Telugu
TV9 Telugu
పొద్దున్నే లేవగానే కాఫీ కావాలా.. టీ కావాలా.. అని అడిగితే టీ కావాలని ఠక్కున చెప్పేస్తారు చాలామంది. వేడివేడి టీ గొంతులో పడిందంటే ఆ రోజంతా ఉత్సాహం రెట్టింపు అవుతుంది
TV9 Telugu
అంతేకాదండోయ్.. ఉదయం నుంచి పనుల్లో నిమగ్నమై సాయంత్రానికి ఇంటికి చేరగానే చాయ్ సిప్ చేస్తే అలసట అంతా మటుమాయం అవ్వాల్సిందే
TV9 Telugu
ఇంటికి ఎవరైనా వచ్చినా.. బయట నలుగురు మిత్రులు కలిసినా.. టీ కచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. చాలా మందికి.. పాలు, డికాషన్, చక్కెరతో తయారు చేసిన టీ తాగడమంటే మహా ఇష్టం
TV9 Telugu
కానీ ఒక నెల పాటు పాలు లేకుండా టీని తాగినట్లయితే శారీరకంగా మరింత ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. సాధారణ టీకి బదులుగా.. హెర్బల్ టీ, గ్రీన్ టీ, నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన ఎంపికలు మిమ్మల్ని మరింత ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు
TV9 Telugu
ముఖ్యంగా మిల్క్ టీ కడుపులో గ్యాస్, ఆమ్లత్వం, అజీర్ణానికి కారణమవుతుంది. అదే ఈ టీని తాగడం మానేస్తే జీర్ణవ్యవస్థ బాగా పనిచేయడం ప్రారంభిస్తుంది. కడుపు తేలికగా, ఆరోగ్యంగా అనిపిస్తుంది. కాబట్టి జీర్ణక్రియను మెరుగుపరచాలనుకుంటే మిల్క్ టీని వెంటనే మానేయడం మంచిది
TV9 Telugu
పాలు - టీ కలయిక శరీరాన్ని నీరసంగా మారుస్తుంది. అయితే పాలు లేకుండా టీ తాగడం వల్ల శక్తి స్థాయి పెరుగుతుంది. రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది
TV9 Telugu
పాలు, చక్కెరతో చేసిన టీలో అదనపు కేలరీలు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. ఈ అలవాటు వదులుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన అవాంఛిత కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది బరువును అదుపులో ఉంచుతుంది
TV9 Telugu
మిల్క్ టీలో ఉండే చక్కెర చర్మాన్ని దెబ్బతీస్తుంది. మొటిమలకు కారణమవుతుంది. అలాగే ధమనులలో వాపును పెంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అదే ఈ అలవాటు వదులుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది