వీటిని నెల పాటు రోజూ తింటే ఒంట్లో ఎన్ని మార్పులో..!
06 March 2025
TV9 Telugu
TV9 Telugu
నేటి కాలంలో జనాల జీవనశైలి నానాటికీ మరింత దిగజారిపోతోంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ నెల పాటు రోజూ కేవలం పండ్లు మాత్రమే తింటే ఏం జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా?
TV9 Telugu
పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపును శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది
TV9 Telugu
తద్వారా కడుపు తేలికగా అనిపిస్తుంది. జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. ముఖ్యంగా బొప్పాయి, పుచ్చకాయ, దానిమ్మ వంటి పండ్లు తింటే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది
TV9 Telugu
పండ్లలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. మీరు నెలపాటు పండ్లు మాత్రమే తింటే, శరీరానికి తక్కువ కొవ్వు, ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. ముఖ్యంగా అధిక చక్కెర కలిగిన పండ్లను తక్కువగా, అధిక ఫైబర్ కలిగిన పండ్లను ఎక్కువగా తింటే బరువు కూడా క్రమంగా తగ్గిస్తుంది
TV9 Telugu
పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, నీరు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సహజంగా ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. ముఖ్యంగా నారింజ, బెర్రీలు, పుచ్చకాయ వంటివి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. ఇవి మొటిమల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి
TV9 Telugu
పండ్లలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అరటిపండు, ఆపిల్, ద్రాక్ష వంటి పండ్లు తినడం వల్ల రోజంతా శరీరానికి శక్తి అందుతుంది. అలసట తగ్గుతుంది
TV9 Telugu
పండ్లలో విటమిన్లు, ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ప్రతిరోజూ వేర్వేరు పండ్లు తింటే జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న అనారోగ్యాలను నివారించవచ్చు. ముఖ్యంగా నిమ్మ, నారింజ, జామ వంటి పండ్లలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి
TV9 Telugu
పండ్లు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. నెల పాటు పండ్లు మాత్రమే తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా దానిమ్మ, బెర్రీలు, అరటిపండు వంటి పండ్లు గుండెకు చాలా మేలు చేస్తాయి