ఇది ఆకు కాదు.. అద్భుతం! రాత్రి నిద్రకు ముందు తిన్నారంటే..

18 March 2025

TV9 Telugu

TV9 Telugu

పూజలు, వ్రతాల్లో తప్పనిసరిగా కనిపించే తమలపాకు.. కేవలం పూజలకే కాదు. కొన్ని ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేసేందుకు బలేగా ఉపయోగపడతాయి

TV9 Telugu

ఇందులో థయామిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ సి, కెరోటిన్ వంటి గుణాలు ఆరోగ్యానికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. వీటిని నేరుగా నమలడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది

TV9 Telugu

తాంబూలంలో ఉపయోగించే తమలపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా భోజనం తర్వాత తమలపాకు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. జీర్ణక్రియ, నోటి పరిశుభ్రత, ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది

TV9 Telugu

భోజనం తర్వాత తమలపాకు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, ఆమ్లత్వం, అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది

TV9 Telugu

తమలపాకులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి దుర్వాసన, దంతాలు, చిగుళ్ల సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి

TV9 Telugu

తమలపాకులు శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. ఇటువంటి పోషకాలు తమలపాకులలో కనిపిస్తాయి. ఇవి విష పదార్థాలను బయటకు పంపడంలో డీటాక్స్‌ మాదిరి సహాయపడతాయి

TV9 Telugu

తమలపాకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి

TV9 Telugu

ఆయుర్వేదం ప్రకారం.. తమలపాకు మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు తమలపాకు తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది