రోజూ గుప్పెడు మొలకలు తింటే... ఊహించని లాభాలు!

28 September 2025

TV9 Telugu

TV9 Telugu

ఆహారపుటలవాట్లు, జీవనశైలి కారణాలేవైతేనేం... మహిళల్లో అధిక మంది హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నారు. అధికబరువు, నెలసరి క్రమం తప్పడం...లాంటి ఎన్నో సమస్యలకు మూలం. ఈ పరిస్థితిని అదుపులోకి తేవాలంటే రోజూ గుప్పెడు మొలకల్ని తినాలి

TV9 Telugu

పెసర్లు, రాగులూ, బొబ్బర్లు, రాజ్మా వంటివన్నీ కలగలిపి వాటితో పాటూ ఒక ఖర్జూరం కలిపి తీసుకుంటే సరి. ఇవి విటమిన్లూ, ఖనిజాలూ, ప్రొటీన్‌ వంటి పోషకాలన్నింటినీ సమతులంగా శరీరానికి అందిస్తాయి

TV9 Telugu

కొందరు వీటిని ఉడికించి తింటారు. మరికొందరు మొలకెత్తించి తినడానికి ఇష్టపడతారు. వీటిని ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే

TV9 Telugu

మొలకల్లో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఎ, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి

TV9 Telugu

ఇవి తేలికైన ఆహారం. జీర్ణం కావడం కూడా చాలా సులభం. కాబట్టి వీటిని అల్పాహారం లేదా భోజనంలో చేర్చుకోవడం మంచిది

TV9 Telugu

మొలకలు శరీరానికి అవసరమైన శక్తిని అందించి, ఉత్తేజపరుస్తాయి. తిన్న తర్వాత కడుపు బరువుగా అనిపించదు. బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎంత తీసుకుంటే అంత మేలు. వీటిలో లభించే పీచు జీర్ణవ్యవస్థ పని తీరును పెంచుతుంది

TV9 Telugu

మొలకల్లో జింక్‌, ఇనుము, క్యాల్షియం ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ శరీరంలోని అన్ని అవయవాలకూ సక్రమంగా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. ముఖ్యంగా జింక్‌ సంతాన సాఫల్య సమస్యల్ని దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది

TV9 Telugu

వీటిని ఎలా తయారు చేయాలంటే.. పెసలతోపాటు ఇతర ధాన్యలను 2 నుంచి 3 గంటలు నీటిలో నానబెట్టి.. వడగట్టి ఓ గుడ్డలో చుట్టి ఏదైనా బాక్స్‌లో ఓ రాత్రంతా ఉంచితే.. తెల్లారేసరికి మొలకెత్తుతాయి