చూసేకి అల్లం మాదిరి ఉంది కదూ..! రుచి అంతకుమించి..

12 October 2025

TV9 Telugu

TV9 Telugu

మామిడి అల్లం గురించి చాలా మందికి అంతగా తెలియదు. ఇదొక శక్తివంతమైన సుగంధ ద్రవ్యం. ఆయుర్వేదంలో దీనిని వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు

TV9 Telugu

ఇది కూడా సాధారణ అల్లం మాదిరి కనిపిస్తుంది. కానీ ఇది నిజంగా అల్లం కాదు. దీని రుచి పచ్చి మామిడికాయ మాదిరి ఉంటుంది. ఇది పసుపు కుటుంబానికి చెందినది. కానీ పసుపు దుంప మాదిరి గట్టిగా కాకుండా మామిడి అల్లం లేత పసుపు రంగు కోర్ మాత్రమే కలిగి ఉంటుంది

TV9 Telugu

మామిడి అల్లం రుచికరంగా ఉండటమే కాకుండా ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని పలు వ్యాధుల నుంచి కాపాడుతుంది

TV9 Telugu

మామిడి అల్లంలో ఉండే ఎంజైమ్‌లు, ఫైబర్ ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. కాబట్టి జీర్ణ సమస్యలతో బాధపడేవారు దీన్ని తినడం మంచిది

TV9 Telugu

గర్భధారణ సమయంలో లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు వికారం నుంచి ఉపశమనం పొందడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. మామిడి అల్లంలో మంచి మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి 

TV9 Telugu

ఈ యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మామిడి అల్లం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ సమస్యలు, గుండెల్లో మంట, అజీర్ణం తగ్గుతాయి

TV9 Telugu

మామిడి అల్లంలో ఉండే సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. కాబట్టి, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు దీనిని తీసుకోవడం మంచిది

TV9 Telugu

మామిడి అల్లంలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి. జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. కాలేయం నుంచి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. దీనిని కొద్ది మొత్తంలో తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది