ఉదయం పూట మనం తీసుకునే ఆహారం.. ఆ రోజంతటికీ కావాల్సిన ఉత్సాహాన్ని అందించే ఇంధనం లాంటిది. అందుకే ఉదయాన్నే ఏదో ఒకటి తినేద్దాం అనుకోవద్దు
TV9 Telugu
మర్చిపోకుండా బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ నేటి కాలంలో చాలా మంది బిజీ జీవనశైలి కారణంగా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారు
TV9 Telugu
వారికి తినడానికి కూడా సమయం దొరకడం లేదు. మరి కొంతమంది బరువు తగ్గడం లేదా బిజీ షెడ్యూల్ కారణంగా అల్పాహారం మానేసి నేరుగా మధ్యాహ్నం 12 లేదా 1 గంటలకు భోజనం చేస్తుంటారు
TV9 Telugu
అల్పాహారం దాటవేయడం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ దీపక్ గుప్తా హెచ్చరిస్తున్నారు
TV9 Telugu
బ్రేక్ ఫాస్ట్ దాటవేయడం వల్ల శరీరానికి శక్తి అందదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి
TV9 Telugu
దీనితో పాటు, మీరు ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ దాటవేయడం అలవాటు చేసుకుంటే లేదా ఎక్కువసేపు ఆకలితో ఉంటే ఇది జీవక్రియను నెమ్మదిస్తుంది
TV9 Telugu
ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. ముఖ్యంగా ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌గా శక్తినిచ్చే పోషకమైన పదార్థాలను తినాలి. ఇందులో భాగంగా ఓట్ మీల్, ఉడికించిన గుడ్లు, పండ్లు, పెరుగు, తృణధాన్యాలు, బ్రెడ్‌ను వంటివి తినడం మంచిది
TV9 Telugu
ఇవి మీ శరీరానికి విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్‌ను అందిస్తుంది. అలాగే పండ్లు, సోయాపాలు, కాయగూరలతో చేసిన ఆమ్లెట్, బాదం... అక్రోట్ వంటి వాటిని తినొచ్చు. వీటితోపాటు బాదం వంటి ఎండు పప్పులని కూడా చేర్చుకోవచ్చు