వేల యేళ్లుగా మన సంప్రదాయ ఆహార అలవాట్లలో భాగమైన మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు వీటి నుంచి శరీరానికి అందుతాయి
TV9 Telugu
అందుకే, ఈ సూపర్‌ఫుడ్ ఇప్పుడు ఫిట్‌నెస్ ఫ్రీక్‌ల డైట్‌గా మారింది. మఖానాతో పాయసం చేసుకోవచ్చు. కూరా వండుకోవచ్చు... ఎలా తిన్నా ప్రయోజనాలు మాత్రం బోలెడు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు వారానికోసారి వీటిని తింటే సరి
TV9 Telugu
మఖానా తేలికపాటి ఆహారం. ఇది డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తుంది. దీనిని పోషకాల నిధి అని కూడా పిలుస్తారు. కేలరీలతో పాటు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం కూడా మఖానాలో అధికంగా ఉంటాయి
TV9 Telugu
మఖానాతో బెల్లం తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. బెల్లం, మఖానా కలిపి తినడం వల్ల ఎముకలు బలపడతాయి
TV9 Telugu
ఇవి కీళ్ల, ఎముకల నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మఖానా, బెల్లం రెండింటిలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది
TV9 Telugu
శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పటికీ మఖానా, బెల్లం తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలో తక్కువ హిమోగ్లోబిన్ ఉండటం వల్ల తరచుగా అలసట, బలహీనతకు కారణమవుతుంది
TV9 Telugu
రక్త హీనతతో బాధపడేవారికి శరీరంలో ఐరన్ లోపం ఉంటుంది. ఇలాంటి వారు మఖానాను బెల్లంతో కలిపి తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది
TV9 Telugu
ముందుగా బెల్లంను పాన్‌లో వేడి చేయాలి. అది కరిగి నీరులా మారి కొద్దిగా గట్టిగా మారిన తర్వాత అందులో మఖానా జోడించాలి. ఇలా తీసుకుంటే రుచికి భలేగా ఉంటుంది. అయితే పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి సుమా!