రోజూ రెండు ఖర్జూరాలు తింటే ఏమవుతుంది?

02 October 2025

TV9 Telugu

TV9 Telugu

ఖర్జూరాలను చాలా మంది పవిత్ర ఆహారంగా భావిస్తారు. ముఖ్యంగా ఖర్జూరాలు మహిళల ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే కలిగే లాభాలు అన్ని ఇన్నీ కావు

TV9 Telugu

ఖర్జూరంలో శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన పోషకాలుంటాయి. పీచు పదార్థం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌లతోపాటు జింక్, కాల్షియం... వంటి ఖనిజ లవణాలను అందిస్తూ శక్తిస్థాయుల్ని కాపాడుతూ, బీపీని నియంత్రణలో ఉంచుతాయి

TV9 Telugu

గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్‌లాంటి సహజ చక్కెరలు (కార్బోహైడ్రేట్స్‌) ఉండటంతో ఉపవాసం అవ్వగానే తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చి, నీరసాన్ని పోగొడతాయి

TV9 Telugu

చక్కెర వద్దనుకునేవాళ్లకు మెరుగైన ప్రత్యామ్నాయమిది. కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌గా తయారుచేసి పంచదార వాడాల్సిన చోట అంతే మోతాదులో దీన్ని వాడితే తియ్యదనానికి తియ్యదనం... ఆరోగ్యానికి ఆరోగ్యం

TV9 Telugu

ఖర్జూరాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, జీర్ణక్రియకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను తొలగిస్తుంది. వీటిల్లోని పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి కూడా మంచివి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి

TV9 Telugu

ఖర్జూరంలో కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. ఆస్టియోపోరోసిస్ సమస్యలను నివారిస్తాయి. వీటిల్లో ఐరన్‌ ఉంటుంది. ఇది రక్తహీనత వంటి వ్యాధులను నివారించి హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుతుంది

TV9 Telugu

ఖర్జూరంలో విటమిన్లు సి, డి కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ముడతలు, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి

TV9 Telugu

ఖర్జూరంలోని విటమిన్ బి6, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెదడు పనితీరును పెంచుతాయి. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళనను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి