రోజూ గుడ్డు తింటే ఒంట్లో కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా?

14 November 2025

TV9 Telugu

TV9 Telugu

ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు కోడిగుడ్డులో ఉంటాయి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, భాస్వరం, విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ బి16, విటమిన్ డి, కాల్షియం, జింక్.. పుష్కలంగా లభిస్తాయి

TV9 Telugu

పిల్లలకు అందించే ఆహారంలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జీవక్రియలు సక్రమంగా సాగడంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి కోడిగుడ్డులోని ప్రొటీన్లు తోడ్పడతాయట

TV9 Telugu

దీనిలో ఉండే విటమిన్ ఎ, ల్యూటిన్, జియాక్సాంథిన్.. లాంటి యాంటీఆక్సిడెంట్లు కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడడంతో పాటు రేచీకటి నుంచి విముక్తి కలిగిస్తాయని చెబుతున్నారు

TV9 Telugu

తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్లు, ఖనిజాలు ఉండే కోడిగుడ్డు.. ఎముకలు, కండరాలు.. దృఢంగా తయారు కావడానికి తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ఐతే రోజూ గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది

TV9 Telugu

గుడ్లు తినడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. బరువు తగ్గుతారు. శక్తిని కాపాడుతాయి. అవి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. గుడ్డులోని పసుపు భాగంలో కొలెస్ట్రాల్ ఉంటుంది

TV9 Telugu

అందుకే గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని అంటారు. దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది

TV9 Telugu

అయితే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ పై దాని ప్రభావం చాలా తక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన వ్యక్తి గుడ్డు తీసుకుంటే, అది కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 1 నుండి 2 గుడ్లు తినాలి

TV9 Telugu

ఇప్పటికే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు,  గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు పరిమిత పరిమాణంలో మాత్రమే గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు