2 వారాల పాటు చక్కెర పూర్తిగా మానేస్తే మీ ఒంట్లో జరిగే మార్పుఇదే..! 

23 February 2025

TV9 Telugu

TV9 Telugu

తీపి పదార్థాలంటే ఎవరికి ఇష్టముండదు? పరిణామక్రమంలో భాగంగానే మనకు వీటిని తినటం అలవాటైంది. అందుకే.. ఆదిమ మానవుల దగ్గరి నుంచి ఆధునిక మానవుల వరకూ అంతా తీపికి దాసులే..

TV9 Telugu

దీనికి కారణం వీటిల్లోని చక్కెర. శరీరానికి అవసరమైన శక్తిని అందించటమే కాకుండా ఆనందాన్నీ ఇవ్వటం దీని ప్రత్యేకత. ఇది ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందే. చక్కెర అతిగా తింటే అధిక బరువు, ఊబకాయం, మధుమేహం వంటి జబ్బుల ముప్పు పెరుగుతుంది

TV9 Telugu

అలాగని అతి తక్కువగా తింటే మెదడు, మనసుకు సంబంధించిన రకరకాల సమస్యలు తలెత్తొచ్చు. చక్కెరతో అంతా చిక్కే. తీపి పదార్థాలను వదిలిపెట్టటం మహా కష్టం. మత్తు పదార్థాల మాదిరిగానే చక్కెర కూడా మెదడులోని నాడీ మార్గాలను ఉత్తేజితం చేస్తుంది

TV9 Telugu

నిజానికి, చక్కెరను దాదాపు అన్ని ఇళ్లలో ఉపయోగిస్తారు. చక్కెర శరీరంలోకి అనేక విధాలుగా ప్రవేశిస్తుంది. టీ, కాఫీ తయారు చేయడం నుంచి స్వీట్లు తినడం వరకు చక్కెర ఎన్నో రకాలుగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది

TV9 Telugu

అయితే చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పరిమిత పరిమాణంలో చక్కెర తినాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు

TV9 Telugu

చక్కెరను వరుసగా 14 రోజులు పూర్తిగా మానేస్తే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి, చక్కెర తీసుకోవడం పూర్తిగా మానేస్తే, మొదటి మూడు రోజుల్లో మీకు అలసట, తలనొప్పి, కడుపు నొప్పి అనిపిస్తుంది

TV9 Telugu

ఆ తర్వాత చక్కెర తినాలనే కోరిక కొంచెం తగ్గుతుంది. నాలుగు నుంచి ఏడు రోజులు ఒంట్లో ఇలా చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రావడంతో తాజాగా, శక్తివంతంగా ఉంటారు. చక్కెర మానేసిన ఎనిమిదవ రోజు నుంచి 10వ రోజు వరకు జీర్ణక్రియ మెరుగుపడటం ప్రారంభమవుతుంది

TV9 Telugu

మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గడం ప్రారంభిస్తాయి. పది రోజులు గడిచాక 11 నుండి 14 రోజుల వరకు బాగా నిద్రపోవడం ప్రారంభిస్తారు. మునుపటి కంటే మెరుగ్గా ఆరోగ్యం ఉంటుంది