చలికాలంలో గుప్పెడు శనగలు బెల్లంతో కలిపి తిన్నారంటే..
10 December 2024
TV9 Telugu
TV9 Telugu
ఈవెనింగ్ టైమ్‌లో స్నాక్స్ తినాలనిపిస్తే గుప్పెడు వేయించిన శనగలు, బెల్లంతో కలిపి తినవచ్చు. వేయించిన శనగలు చాలా రుచికరంగా ఉండటంతో పాటు కడుపు నిండిన భావనను అందిస్తాయి
TV9 Telugu
పైగా కొలెస్ట్రాల్ ఉండదు. వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఐరన్, సెలీనియం, మాంగనీస్, కాల్షియం, కాపర్, జింక్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఇవన్నీ గుండె జబ్బులు రాకుండా కాపాడతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ పోషకాలు రక్తంలో గడ్డలు కట్టకుండా అరికడతాయి. ముఖ్యంగా చలికాలంలో రోజూ వేయించిన శనగలు బెల్లంతో కలిపి తింటే మరచిపోలేని ప్రయోజనాలు పొందవచ్చు
TV9 Telugu
ఈ రెండూ మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో బెల్లం, శనగలను కలిపి తినడం ఎంతో మంచిది. ఇది శరీరానికి మూలకాలను అందిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది
TV9 Telugu
చలికాలంలో రోజూ బెల్లం, శనగపప్పు తింటే చరుకుగా ఉండవచ్చు. వీటిలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎక్కువ కాలం శక్తివంతంగా ఉంచడంలో సహాయపడతాయి
TV9 Telugu
పిల్లలు, వృద్ధులతో సహా ప్రతి ఒక్కరూ వీటిని తినవచ్చు. చల్లని వాతావరణంలో సులభంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ ఆహారం మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది
TV9 Telugu
బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇదికాకుండా కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఐరన్ తీసుకోవడం వల్ల శరీరంలోని రక్తహీనత తొలగిపోతుంది
TV9 Telugu
బెల్లం, శనగలు తినడం వల్ల ఎముకలు, కండరాలు బలపడతాయి. బెల్లంలో కాల్షియం ఉంటుంది. పప్పులో ఉండే ప్రోటీన్ కండరాలను బలంగా చేస్తుంది. జీర్ణవ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది