నూనె లేని వంటలు ఆరోగ్యానికి మంచివని తెలిసినా... వంటకానికి మంచి రుచి కావాలంటే గిన్నెలో ఆయిల్ పడాల్సిందే. చాలా ఆహారాలలో నూనె విచ్చలవిడిగా ఉపయోగిస్తుంటాం
TV9 Telugu
సగటున ఒక వ్యక్తి ఏడాదికి దాదాపు 18 కిలోల వంట నూనెను వినియోగిస్తున్నట్లు ఇటీవలి అధ్యయనంలో తేలింది. అయితే నూనెను ఎలా పడితే అలా నీళ్లలా వాడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు
TV9 Telugu
మనం వినియోగించే అన్ని రకాల నూనెల్లోనూ ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొవ్వుల శాతం పెరిగిపోతుంది. ఇవి ధమనుల్లోని రక్త ప్రవాహానికి అడ్డుపడతాయి
TV9 Telugu
ఫలితంగా వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలో నూనె వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రుచికరమైన ఆహారంతో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుంది
TV9 Telugu
నూనె ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం కేడా వస్తుంది. ఇది శరీరంలో తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి పరిమిత పరిమాణంలో మాత్రమే నూనె తీసుకోవడం మంచిది. అందుకే చాలా మంది ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని, చాలా తక్కువ నూనె మాత్రమే తింటుంటారు
TV9 Telugu
ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తమ ఆహారంలో చేర్చుకుంటూ ఉంటారు. అయితే ఆహారంలో అసలు నూనె తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆహారం నుంచి నూనె పూర్తిగా తొలగిస్తే కేవలం ఒక నెలలోనే బరువు తగ్గడానికి సహాయపడుతుంది
TV9 Telugu
అలాగే ఆహారంలో నూనెను పూర్తిగా తొలగిస్తే చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. దీనివల్ల మొటిమలు వంటి చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి
TV9 Telugu
నూనెను తొలగించి ఎక్కువగా సూప్, సాదా పప్పు, ఉడికించిన కూరగాయలు వంటివి తింటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది
TV9 Telugu
ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు నూనెను చాలా జాగ్రత్తగా, తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి