రోజూ టమోటాలు తింటే ఏమౌతుందో తెలుసా?

30 January 2025

TV9 Telugu

TV9 Telugu

ఇంట్లో టొమాటోలు ఉన్నాయంటే... ఇతర కూరగాయలతో కలిపి వండేస్తుంటాం. లేదంటే పప్పూ /పచ్చడీ చేస్తాం కదూ. అవేవీ కాకుండా ఈసారి అచ్చంగా టొమాటోలతోనే ఇలాంటి కూరల్ని వండితే సరి

TV9 Telugu

టమాటాతో చేసిన వంటకాలు అన్నం, రోటీ, పులావ్‌... దేనికైనా మంచి కాంబినేషన్‌ అవుతాయి. దాదాపు అన్ని వంటకాల్లో విరివిగా ఉపయోగించే టొమాటోల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి

TV9 Telugu

టమాటాలో ముఖ్యమైన విటమిన్లు ఎ, సి, కె, బి1, బి3, బి5, బి6, బి7 ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టొమాటోలో ఫోలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, కోలిన్, జింక్, ఫాస్పరస్ కూడా ఉన్నాయి

TV9 Telugu

వీటిలో విటమిన్లు ‘ఎ’, ‘సి’, పొటాషియం, క్యాల్షియం.. వంటి ముఖ్యమైన పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో బలేగా ఉపయోగపడతాయి. అలాగే టమాటాల్లో లైకోపీన్ అనే రసాయనం ఉంటుంది

TV9 Telugu

ఇది క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. టమాటా గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది

TV9 Telugu

ఎందుకంటే ఇందులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్, కోలిన్ పుష్కలంగా ఉంటాయి. టమాటా చర్మానికి చాలా మంచిది. ఇందులోని లైకోపీన్ సూర్యుని హానికరమైన UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది

TV9 Telugu

అలాగే చర్మకాంతి కూడా పెరుగుతుంది. టమాటాలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అదనంగా, విటమిన్ సి ఒత్తిడి హార్మోన్ల అభివృద్ధిని నియంత్రిస్తుంది

TV9 Telugu

టమాటా గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. ఇందులోని పోషకాలు శిశువుకు, తల్లికి ఇద్దరికీ చాలా అవసరం. అందుకే ఆరోగ్యానికి ఇన్ని రకాలుగా ఉపయోగపడే టమాటా రోజూ ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు