కలరా వ్యాధి నయం చేసే ఉల్లి.. సుగుణాల కల్పవల్లి!

07 October 2025

TV9 Telugu

TV9 Telugu

ఆరోగ్యానికి మంచిదనో, ఘాటైన దాని రుచో... కారణం ఏదయితేనేం... ఉల్లి ఘాటు లేని కూర మనవాళ్లకీ సహించదు. రుచికే కాదు ఇందులో ఆరోగ్య సుగుణాలూ మెండే

TV9 Telugu

సాంబారు, రసం, పులుసుల్లోనూ; ఉప్మా, పకోడీ, బిర్యానీ... ఇలా ఎందులోనయినా ఉల్లి ఉంటేనే అదుర్స్‌. ఇంకా చాలా వంటల్లో ఉల్లిపాయలు నేరుగా కనిపించవు. తెర వెనుక పాత్రధారుల్లా రుచి ద్వారా తమ ఉనికిని చాటుతుంటాయి

TV9 Telugu

అయితే ఉల్లిపాయలో తామస, రజో గుణాల్ని పెంచే లక్షణాలు ఉంటాయనీ శృంగారప్రేరితమనీ ఆయుర్వేదం చెబుతుంది. అందుకే కొన్ని వర్గాలకి చెందినవాళ్లూ సన్యసించిన వాళ్లూ దీన్ని వాడరు

TV9 Telugu

ఉల్లిపాయలో 89శాతం నీరు, 9శాతం పిండిపదార్థాలు, ఒక శాతం ప్రొటీన్‌ ఉంటుంది. పొటాషియం, ఐరన్‌, సోడియం, ఫాస్ఫరస్‌, కాల్షియం, ఐరన్‌... వంటి ఖనిజాలూ; ఫొలేట్‌, విటమిన్‌-సి, ఎ, బి6లతోపాటు పీచూ పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

అందుకే అవి ఎంత వాడితే అంత మంచిది. కళ్లు, కీళ్లు, గుండె, పొట్ట... ఇలా అన్ని అవయవాల్నీ సంరక్షిస్తుంది ఉల్లిపాయ. ఉల్లిలోని డై- ట్రై సల్ఫైడ్‌లూ, వినైల్‌ డైథీన్‌లూ కొవ్వుని కరిగించడంతోపాటు బ్యాక్టీరియానీ వైరస్‌లనీ నివారిస్తాయి

TV9 Telugu

క్వస్టిన్‌ కణజాల సంరక్షణకీ విటమిన్‌-ఇ ఉత్పత్తికీ జ్ఞాపకశక్తికీ తోడ్పడడంతోపాటు రొమ్ము, ఊపిరితిత్తుల వ్యాధులతోనూ పోరాడుతుంది. ఉల్లి తింటే ఎముకల్లో ఖనిజ సాంద్రత పెరుగుతుంది. ఉల్లిని బెల్లంతో కలిపి తింటే గొంతు నొప్పి మాయం అవుతుంది

TV9 Telugu

జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు నాలుగు టీస్పూన్ల ఉల్లిరసంలో చిటికెడు ఇంగువ, నల్లఉప్పు కలిపి రోజుకి రెండుమూడుసార్లు మూడునెలలపాటు తాగితే నులిపురుగుల బాధ ఉండదనీ చెబుతారు గృహవైద్య నిపుణులు

TV9 Telugu

తెల్ల ఉల్లిపాయ ముక్కల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే మూత్రంలో మంట తగ్గడంతోపాటు మూత్రపిండాలూ ఆరోగ్యంగా ఉంటాయి. కలరా వ్యాధితో బాధపడే రోగికి ఉల్లిరసాన్ని తరచూ పట్టిస్తే మంచిదట. పచ్చి ఉల్లిపాయని తింటే నెలసరి సమస్యలూ తగ్గుతాయి