వెల్లుల్లి, ఉల్లి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? 

14 February 2025

TV9 Telugu

TV9 Telugu

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. సౌందర్య నిపుణులు సైతం ఇది నిజమే అంటున్నారు. అవునండీ... ఉల్లి కేవలం ఆరోగ్యాన్నే కాదు, అందాన్నీ సంరక్షిస్తుందట. దాంతో కూరగాయగా వాడుకునే ఉల్లిపాయతో బ్యూటీ ఉత్పత్తుల్నీ రూపొందిస్తున్నారు

TV9 Telugu

ఉల్లి చేసే మేలుని గుర్తించిన ఈజిప్షియన్లు వాటిని దేవతల్లా పూజించేవారట. అప్పట్లో కలరా, ప్లేగు నివారణకి ఉల్లిపాయ వాడిన ఆధారాలు ఉన్నాయి. ఆరోగ్యానికి మంచిదనో, ఘాటైన దాని రుచో... కారణం ఏదయితేనేం... ఉల్లి ఘాటు లేని కూర మనవాళ్లకీ సహించదు

TV9 Telugu

సాంబారు, రసం, పులుసుల్లోనూ, ఉప్మా, పకోడీ, బిర్యానీ... ఇలా ఎందులోనయినా ఉల్లి ఉంటేనే అదుర్స్‌. ఇంకా చాలా వంటల్లో ఉల్లిపాయలు నేరుగా కనిపించవు. తెర వెనుక పాత్రధారుల్లా రుచి ద్వారా తమ ఉనికిని చాటుతుంటాయి

TV9 Telugu

ఇక ఉల్లితోపాటు వంటగదిలో కనిపించే వెల్లుల్లి కూడా వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటాం. కూరగాయలు, పప్పులు వంటి పలు రకాల వంటకాలను తయారు చేయడానికి వెల్లుల్లి ఉపయోగిస్తుంటాం

TV9 Telugu

వెల్లుల్లి, ఉల్లి ఇవి రెండూ ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటిని కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది తరచుగా అనారోగ్యానికి గురయ్యే వారిని ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది

TV9 Telugu

ఈ రెండూ వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి. దీన్ని తీసుకోవడం ద్వారా ముడతలు, నల్లటి మచ్చలు, ముఖంపై చక్కటి గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలను నివారించవచ్చు

TV9 Telugu

దీనితో పాటు బరువు తగ్గాలనుకునే వారికి ఉల్లి, వెల్లుల్లి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటే వెల్లుల్లి తినడం ద్వారా దానిని తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు