గుడ్డు సంపూర్ణ పోషకాహారమనే విషయం తెలిసిందే. ప్రొటీన్లతో పాటు విటమిన్లు, ఖనిజాలెన్నో నిండి ఉన్న గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు
TV9 Telugu
ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు కోడిగుడ్డులో ఉంటాయి. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ ఇందులో పుష్కలంగా లభిస్తాయి
TV9 Telugu
పిల్లలకు అందించే ఆహారంలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే విటమిన్ ఎ; ల్యూటిన్, జియాక్సాంథిన్.. లాంటి యాంటీఆక్సిడెంట్లు కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడడంతో పాటు రేచీకటి నుంచి విముక్తి కలిగిస్తాయి
TV9 Telugu
తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్లు, ఖనిజాలు ఉండే కోడిగుడ్డు.. ఎముకలు, కండరాలు.. దృఢంగా తయారు కావడానికి తోడ్పడుతుంది. ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది
TV9 Telugu
రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్‌ని సందర్శించాల్సిన అవసరం లేనట్లే, గుడ్లకు కూడా అదే నియమం వర్తిస్తుంది. అందుకు ప్రతిరోజూ గుడ్డు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు
TV9 Telugu
ఒక వ్యక్తి ప్రతిరోజూ గుడ్డు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీవక్రియలు సక్రమంగా సాగడంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి కోడిగుడ్డులోని ప్రొటీన్లు తోడ్పడతాయి
TV9 Telugu
గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకలకు బలాన్ని ఇస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోజూ గుడ్లు తినడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిది
TV9 Telugu
గుడ్డులో ఉండే ల్యూటిన్, ప్రొటీన్ వంటి పోషకాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. అంతేకాదు చర్మానికి తేమను అందించి వృద్ధాప్యం నుంచి కాపాడుతుంది. గుడ్లలో కోలిన్, ఒమేగా-3 పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడుకు, గుండెకు, కళ్లకు మేలు చేస్తాయి