నెలపాటు రోజూ బంగాళదుంపలు తింటే ఏమవుతుందో తెలుసా?

19 January 2025

TV9 Telugu

TV9 Telugu

నీటిలో ఉడకబెట్టినా రుచి.. నిప్పుకణికలపై వేసినా నోరూరిస్తుంది.. కాస్త నూనెలో వేసి వేపుడు చేసి ఉప్పు, కారం చల్లితే చాలు ఆకలి పెరగాల్సిందే.. సన్నని ముక్కలు చేసి వేయించి తిన్నా కరకరలాడుతూ భోజనం తృప్తిగా ఉండేలా చేస్తుంది

TV9 Telugu

ఈ లక్షణాలన్నీ ఉండబట్టే ప్రపంచవ్యాప్తంగా భోజనప్రియులను అలరారిస్తున్న ‘ఆలుగడ్డ’ ప్రతి ఇంటి వంటగదిలో గుమగుమలాడిపోతుంది. బంగాళదుంప అనేది ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడే కూరగాయల్లో చాలా ప్రత్యేకం

TV9 Telugu

ఏ ఇంట్లో అయినా కూరగాయలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు, కానీ బంగాళదుంపలు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి

TV9 Telugu

వీటిల్లో కార్బోహైడ్రేట్‌లతో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్, కెరోటినాయిడ్‌లు, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

బంగాళా దుంపలు తింటే లావవుతామనుకుంటారు చాలా మంది. ఇది నిజం కాదు. ఆలుగడ్డల్లో పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అయితే దీన్ని నూనెలో వేయించి తినొద్దు. ఉడకబెట్టి తీసుకోవడం మంచిది

TV9 Telugu

నిజానికి, బంగాళాదుంపలలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఫలితంగా మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినకపోవడమే మంచిది

TV9 Telugu

రక్తపోటు సమస్యలు ఉన్నవారు బంగాళదుంపల వాడకాన్ని తగ్గించాలి. బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. బంగాళాదుంపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి

TV9 Telugu

బంగాళదుంప వేడి స్వభావం కలిగి ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు అవుతాయి. అందుకే బంగాళదుంపలను రోజూ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండు లేదా మూడు రోజులకు ఒకసారి మాత్రమే దీన్ని తీసుకోవాలి