ఒకప్పుడు బ్రెడ్‌ను ఏదయినా అనారోగ్యం నుంచి కోలుకునేవారికే పెట్టేవారు. కానీ ఇప్పుడది రోజువారీ టిఫిన్లలో ఓ భాగం. ఎందుకంటే టిఫిన్ చేసే సమయం లేనప్పుడు బ్రెడ్‌ను మించిన ప్రత్యామ్నాయం లేదనుకునేవారి సంఖ్య ఇప్పుడు ఎక్కువ
TV9 Telugu
అదే పెద్దవాళ్లయితే వాటిపైన పీనట్‌బటర్‌ను రాసుకున్నా, శాండ్‌విచ్ రూపంలో చేసుకున్నా ఆ పూటకు టిఫిన్ అయిపోయినట్లే. అందుకేనేమో ఒకప్పటితో పోలిస్తే... ఇప్పుడు బ్రెడ్‌ను ఇష్టపడేవారు ఎక్కువ
TV9 Telugu
దానికి తగినట్లుగానే బ్రెడ్ కూడా రకరకాల రుచుల్లో వచ్చేస్తూ నోరూరించేస్తోంది. ఇక్కడున్న బ్రెడ్ రకాలన్నీ అలాంటివే మరి. వీటన్నింటినీ చిరుధాన్యాలు, క్వినోవా, రాగులు, ఖర్జూరాలు, బాదం, బెల్లం, అవిసెగింజలు, దాల్చినచెక్క, మసాలా... ఇలా పలురకాల రుచుల్లో చేస్తున్నారిప్పుడు
TV9 Telugu
నిజానికి బ్రెడ్.. ప్రధానంగా కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం. ఇది శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, బ్రెడ్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, ఏదైనా ఎక్కువగా తినడం అంత మంచిది కాదు. అందువల్ల ప్రతిరోజూ బ్రెడ్ తినడం వల్ల శరీరంలో అనేక సమస్యలు కూడా వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
ప్రతిరోజూ అల్పాహారంగా బ్రెడ్ తినడం వల్ల తలెత్తే కొన్ని సమస్యలలో బరువు పెరగడం, మధుమేహం ముఖ్యమైనవి. అలాగే జీర్ణ సమస్యలు, శరీరంలో పోషకాహార లోపాలు తలెత్తుతాయి
TV9 Telugu
బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. దీనివల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బ్రెడ్‌లో అదనపు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అందుకే ఆ కేలరీలు తీసుకోవడం వల్ల ఎవరైనా బరువు పెరుగుతారు
TV9 Telugu
ప్రతిరోజూ బ్రెడ్ తినడం వల్ల కాలేయం కూడా దెబ్బతింటుంది. కొన్నిసార్లు కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల ప్రతిరోజూ బ్రెడ్ తినకూడదు. బదులుగా వారానికి ఒకసారి అల్పాహారంగా తినడంతోపాటు ఏదైనా ఒక రకం పండు తినడం మంచిది