అరటి పండుని వీటితో కలిపి తిన్నారంటే ఉక్కులాంటి ఒళ్లు మీ సొంతం!
10 March 2025
TV9 Telugu
TV9 Telugu
పసివాళ్ల నుంచి పండు ముదుసలి వరకూ సులభంగా తినగలిగే పోషకఫలం... శుభకార్యాల్లోనూ పూజల్లోనూ నైవేద్యంగా ప్రసాదంగా పంచే పవిత్ర ఫలం... అదే మనందరికీ సుపరిచితమైన అరటిపండు
TV9 Telugu
పండ్లన్నీ ఆరోగ్యానికి మంచివే. కానీ అరటి పండు మాత్రమే ఆరోగ్యంతోపాటు ఆనందాన్నీ అందిస్తుంది. తేలికగా జీర్ణమవుతుంది. మృదువుగా ఉంటుంది కాబట్టి అన్నం కన్నా ముందు పసివాళ్లకు తినిపించే ఘనాహారం కూడా ఇదే
TV9 Telugu
నిజానికి రోజుకో ఆపిల్ తింటే వైద్యుడితో పని ఉండదు అంటారు కానీ, రోజుకో అరటిపండు తిన్నా చాలు, సకల రోగాల నుంచీ సంరక్షిస్తుంది
TV9 Telugu
అరటిపండు ఏడాదంతా లభించే పండు. ఇది ఇతర పండ్ల కంటే చౌకగా ఉంటుంది. కాబట్టి సామాన్యులు దీనిని ఎక్కువగా తింటారు. అయితే బాదంతో అరటిపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
ప్రతిరోజూ ఉదయం ఒక అరటిపండుతో పాటు 5 నానబెట్టిన బాదం పప్పులను తొక్క తీసి తినాలట. ఇది శరీరంలోని శక్తి స్థాయిని తగ్గకుండా కాపాడుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు
TV9 Telugu
అరటిపండు, బాదంపప్పులను క్రమం తప్పకుండా తింటే, అది గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన గుండెకు పొటాషియం ముఖ్యమైన ఖనిజం. ఇది అరటిపండు, బాదంలో పుష్కలంగా ఉంటుంది
TV9 Telugu
రోజూ ఉదయం పూట అరటిపండు, బాదం తినడం వల్ల రోజంతా శక్తితో నిండి ఉంటారు. ముఖ్యంగా అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది సెరోటోనిన్ విడుదలకు సహాయపడుతుంది
TV9 Telugu
అందుకే తరచూ అరటిపండు తింటే మానసిక స్థితి కూడా బాగుంటుందని నిపుణులు అంటున్నారు. మీరూ మంచి మూడ్‌లో ఉంటారు. అరటిపండులో ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది