సీజన్‌తో సంబంధం లేదు. ఈ రాష్ట్రం ఆ దేశం అని లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా పండుతుంది. పసివాళ్ల నుంచి పండు ముదుసలి వరకూ సులభంగా తినగలిగే పోషకఫలం అరటి
TV9 Telugu
ఏడాది పొడవునా దొరికేది, అందరికీ అందుబాటులో ఉండేది, ఎంతగానో మేలు చేసేది ఏదంటే- అది కచ్చితంగా అరటిపండే
TV9 Telugu
ఈ పండు తినడం వల్ల ఎన్నెన్ని ప్రయోజనాలున్నాయో చూడండి.. పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, రిబోఫ్లేవిన్, ఫొలేట్, కాపర్, పీచు, బి6, సి-విటమిన్లతో ఇది మంచి పోషకాహారం
TV9 Telugu
తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులను రానివ్వదు
TV9 Telugu
మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ నొప్పి, వాపులను తగ్గించి.. మొత్తంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్మోన్లను క్రమబద్ధం చేస్తుంది
TV9 Telugu
అరటిపండు మూత్రపిండాల్లో సమస్యలను నివారిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకుంటే నీరసం తగ్గి, తక్షణ శక్తి వస్తుంది
TV9 Telugu
ఇంత మేలు చేసే అరటిపండు ఎంతో రుచిగా కూడా ఉంటుంది కనుక ఇష్టంగానే తినేయొచ్చు. దీన్ని ఓట్‌మీల్, మిల్క్‌షేక్, స్మూథీ, సలాడ్స్‌లోనూ వేసుకోవచ్చు
TV9 Telugu
స్వీట్లూ చేయొచ్చు. ఇన్ని లాభాలున్నప్పటికీ.. అలర్జీలు, ఉబ్బసం, సైనస్ లాంటి ఇబ్బందులేమైనా ఉండి బాధపడుతుంటే మాత్రం అరటిపండుకు దూరంగానే ఉండాలి