బ్రేక్‌ఫాస్ట్‌లో అరటిపండ్లు తింటున్నారా..? ఎంత డేంజరో తెల్సా..

18 July 2025

TV9 Telugu

TV9 Telugu

అరటిపండు ఓ సూపర్ ఫుడ్. ఈ పండు ఏడాది పొడవునా మార్కెట్లో లభిస్తుంది. ఇందులో అనేక పోషక ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి అరటిపండును కూరగాయగా వండేసుకుని తింటాం. అదే పండిన అరటిపండును పండుగా తింటాం

TV9 Telugu

ఎన్నో పోషక విలువలతో కూడిన ఈ పండ్లను పిల్లల నుంచి వృద్ధుల దాకా అందరూ ఇష్టపడి తింటారు. తక్షణ శక్తికి, తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేయడంలోనూ మెరుగ్గా పని చేస్తుందీ మ్యాజికల్‌ ఫ్రూట్‌

TV9 Telugu

అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. కొంత మంది అరటి పండును ఉదయం అల్పాహారంగా తింటుంటారు. ఇలా ప్రతిరోజూ అల్పాహారంగా అరటిపండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా

TV9 Telugu

అల్పాహారంగా అరటిపండ్లు తినడం మంచిది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది. అరటిపండ్లు కడుపు నిండుగా ఉంచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయి

TV9 Telugu

నిజానికి, అరటిపండ్లు ఎంత సూపర్ ఫుడ్ అయినా ఇవి అందరికీ మంచిది కాదు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. అరటిపండ్లలో ఫైబర్, పొటాషియం, మాంగనీస్ ఉంటాయి. వాటిలో సుక్రోజ్, ఫ్రక్టోజ్ కూడా పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

అందుకే చాలా మంది అరటిపండ్లకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అల్పాహారంలో అరటిపండ్లు తినడం అంత మంచిది కాదు

TV9 Telugu

ఉదయం పూట ఎక్కువ మొత్తంలో అరటిపండ్లు తినడం వల్ల నరాలపై అదనపు ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా ఎక్కువ అరటిపండ్లు తినడం వల్ల మైగ్రేన్ సమస్య పెరుగుతుంది

TV9 Telugu

అరటిపండ్లు ఎక్కువగా తినడం వల్ల దీర్ఘకాలిక తలనొప్పి వస్తుంది. అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఈ అమైనో ఆమ్లం మానసిక పనితీరును తగ్గిస్తుంది. వాయుమార్గాలలో వాపును కలిగిస్తుంది. అందుకే ఇవి ఎక్కువగా తినడం ప్రమాదకరం